Share News

Auto Drivers: 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌

ABN , Publish Date - Nov 22 , 2024 | 03:16 AM

ఆటో డ్రైవర్ల డిమాండ్ల సాధనకు వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌ చేపట్టడంతో పాటు హైదరాబాద్‌లో లక్ష మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ వెల్లడించింది.

Auto Drivers: 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌

  • తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ

బర్కత్‌పుర, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్ల డిమాండ్ల సాధనకు వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌ చేపట్టడంతో పాటు హైదరాబాద్‌లో లక్ష మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా మోసం చేసిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.


బీఆర్‌ఎ్‌సకు పట్టిన గతే కాంగ్రె్‌సకు పడుతుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లో 20 వేల కొత్త ఆటో పర్మిట్‌లు ఇవ్వాలని, ఆటోలకు థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ చెల్లించాలని, యాక్సిడెంట్‌ బీమాను 10 లక్షలకు పెంచాలని కోరారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్‌ కుటుంబానికి 12 వేల ఆర్థిక సాయం పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 03:16 AM