Share News

TS News: 21న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం!

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:30 AM

ఈ నెల 21న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 15 నాటికి అమలు చేయబోయే పంట రుణాల మాఫీ పథకంపై చర్చించనున్నారు.

TS News: 21న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం!

  • ‘రుణ మాఫీ’ విధివిధానాలపై చర్చ

  • అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీ ఖరారు

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 15 నాటికి అమలు చేయబోయే పంట రుణాల మాఫీ పథకంపై చర్చించనున్నారు. రుణ మాఫీ పథకం అమలుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అవసరమైన నిధులను సేకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, విధి విధానాలను కూడా ఖరారు చేయబోతోంది. పథకానికి ఎప్పటి నుంచి కట్‌ ఆఫ్‌ డేట్‌ను నిర్ణయించాలి, ఇంకా ఎలాంటి నిబంధనలు విధించాలన్నదానిపై కసరత్తు చేస్తోంది. దీనిపై క్యాబినెట్‌ భేటీలో కూలంకషంగా చర్చించి, మంత్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకోనుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నందున ప్రారంభ తేదీని ఖరారు చేయనుంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరిలో జరిగాయి. వీటితో పాటు ఇతర అంశాలు చర్చకు రానున్నాయి.

Updated Date - Jun 19 , 2024 | 08:37 AM