TS Cabinet: వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు బదులు టీజీ!.. నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం
ABN , Publish Date - Feb 04 , 2024 | 07:15 AM
ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు సెక్రటేరియెట్‌లో తెలంగాణ క్యాబినెట్ కీలక భేటి జరగనుంది. వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు బదులుగా టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు సెక్రటేరియెట్‌లో తెలంగాణ క్యాబినెట్ కీలక భేటి జరగనుంది. వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు బదులుగా టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ పథకాలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు కులగణనకు కూడా ఆమోదముద్ర వేయనున్నారు. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాల నిర్వాహాణపై మంత్రులు నిర్ణయించనున్నారు.