Share News

CM Revanth Reddy: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏం జరగబోతోంది?

ABN , Publish Date - Aug 16 , 2024 | 07:27 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన షురూ అయ్యింది. గురువారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.

CM Revanth Reddy: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏం జరగబోతోంది?

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన షురూ అయ్యింది. గురువారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీలో తాజా పరిణామాలు, నూతన పీసీసీ అధ్యక్షుడు ఎంపిక, కేబినెట్‌లో కొత్తవారికి చోటు కల్పించడం సహా ఇతర అంశాలపై చర్చించనున్నాడని తెలుస్తోంది. మరోవైపు రైతు రుణమాఫీ అంశాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ వివరించనున్నారు. మూడు విడతల్లో రైతులకు రుణమాఫి చేసిన విధానానికి సంబంధించిన అంశాలను తెలియజేయనున్నారు.


ఫాక్స్‌ కాన్ చైర్మన్, సీఈవోలతో భేటీ..

రాజకీయ అంశాలతో సీఎం మరో భేటీ నిర్వహించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్, సీఈవో యంగ్ లియూతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొననున్నారు. ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లియూతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది.


నేడు ఎమ్మెల్సీలుగాకోదండరామ్, అమీర్ ఆలిఖాన్

ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ ఆలిఖాన్ ఇవాళ (శుక్రవారం) ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఉదయం 10.30 గంటలకు మండలి కార్యాలయంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 07:27 AM