Share News

Hall tickets: గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌..

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:41 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు ఈ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Hall tickets: గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌..

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు ఈ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 21 నుంచి 27వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్వహిస్తున్నారు. హాల్‌టికెట్లు పరీక్ష ప్రారంభమయ్యే ఒక రోజు ముందు వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.


మెయిన్స్‌ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్ష హాల్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు అభ్యర్థులను అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. మెయిన్స్‌లో భాగంగా ప్రతి అభ్యర్థి ఆరు పేపర్లకు సంబంధించి పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

Updated Date - Oct 15 , 2024 | 03:41 AM