Constables Training: మత్తును పసిగట్టడమెలా?
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:32 AM
తెలంగాణ పోలీసుశాఖలో కొత్తగా చేరనున్న కానిస్టేబుళ్లకు వృత్తికి సంబంధించిన అంశాలతో పాటు డ్రగ్స్ కేసులకు సంబంధించి ప్రత్యేక శిక్షణను ఇచ్చినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలిపారు.
ట్రైనీ కానిస్టేబుళ్లకు పాఠాలు
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసుశాఖలో కొత్తగా చేరనున్న కానిస్టేబుళ్లకు వృత్తికి సంబంధించిన అంశాలతో పాటు డ్రగ్స్ కేసులకు సంబంధించి ప్రత్యేక శిక్షణను ఇచ్చినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలిపారు. మత్తుమందులను గుర్తించడం, ఆ వ్యాపారానికి సంబంధించిన విషయాలు, డ్రగ్ పెడ్లర్లు, డీలర్లు, ఎలాం టి వారు మాదకద్రవ్యాలకు బానిసలవుతారు, వారిని గుర్తించడం ఎలా తదితర అంశాలపై శిక్షణనిచ్చినట్లు చెప్పారు. కాగా, ఈ ఏడాది 8వేల 47మంది స్టైపెండరీ క్యాడెట్ కానిస్టేబుళ్ల శిక్షణ ఇటీవలే పూర్తయింది. వీరి లో 2,338 మంది మహిళలున్నారు. వీరికి రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి పోలీసు అకాడమితో పాటు 19 ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణనిచ్చారు.