Share News

Bakki Venkataiah: అట్రాసిటీ కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌ సరికాదు

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:38 AM

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేస్తున్నారని, ఇది సరికాదని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య తెలిపారు.

Bakki Venkataiah: అట్రాసిటీ కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌ సరికాదు

  • తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

న్యూఢిల్లీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేస్తున్నారని, ఇది సరికాదని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య తెలిపారు. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బెయిల్‌ ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు మాత్రమే ఉందని ఆయన తెలిపారు.


ప్రస్తుతం స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీ చట్టం నీరుగారుతోందంటూ సీఎం రేవంత్‌, డీజీపీలకు లేఖలు రాసినట్టు గుర్తు చేశారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సిన అంశమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండటంతో కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కలిశామని చెప్పారు. లగచర్ల ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు ఇచ్చామని, నివేదిక రావాల్సి ఉందన్నారు. 25న లగచర్ల గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడుతామని తెలిపారు.

Updated Date - Nov 21 , 2024 | 04:38 AM