Telangana: తెలంగాణపై టీడీపీ ఫోకస్.. టార్గెట్ జీహెచ్‌ఎంసీ..!
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:10 PM
తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. ఓవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి క్యూకడుతున్నారు. దీంతో ఆ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. ఓవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి క్యూకడుతున్నారు. దీంతో ఆ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఆచితూచి అడుగులేస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసేందుకు హస్తం పార్టీ తన ప్రణాళికలు రూపొందిస్తుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోవాలనే ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో తెలంగాణలో పూర్వవైభవం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిరేపుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన గడ్డపై తెలుగుదేశం పార్టీ మళ్లీ బలపడుతుందంటూ కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
Samineni Udayabhanu: ఇంత ఘోర ఓటమెలా.. నిద్ర పట్టడం లేదు!
తెలంగాణలో బలపడేందుకు..
తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం కొంతమేర తగ్గింది. పార్టీలో నాయకులు ఇతర పార్టీలో చేరిపోయారు. కొంతమంది మాత్రం పార్టీని నమ్ముకుని ఉన్నారు. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేయలేదు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసినా ఆ పార్టీ ఒక్కసీటు గెలుచుకోలేదు. కనీసం సొంత జిల్లా మెదక్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. దీంతో బీఆర్‌ఎస్ బలహీనపడుతుందనే వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ స్పేచ్‌ను ఆక్రమించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
TDP: చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర
టార్గెట్ జీహెచ్‌ఎంసీ..
మరో ఏడాదిన్నరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పునర్వైభవం సాధించే వీలుటుందని తెలుగుదేశం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ఎన్డీయే మిత్రపక్షంగా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీజేపీ బలంగా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ఏపీ కాంబినేషన్‌ను రిపీట్ చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తే మేయర్ పీఠం దక్కించుకోవచ్చనే ప్లాన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News