Telangana: 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం.. ఎవరెవరికి ఎన్నంటే
ABN , Publish Date - Feb 20 , 2024 | 03:07 PM
తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు 2, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కనుంది.
హైదరాబాద్: తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు 2, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కనుంది. రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులకు రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డి ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు.
ఏకగ్రీవం అయిన వారిలో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ తరపున వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఫిబ్రవరి 15తో ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. మూడు స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.