Share News

2 నుంచి టెట్‌ ఫిబ్రవరి 5న ఫలితాలు

ABN , Publish Date - Dec 19 , 2024 | 05:35 AM

రాష్ట్రంలో టెట్‌ పరీక్షలు జనవరి 2 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

2 నుంచి టెట్‌ ఫిబ్రవరి 5న ఫలితాలు

  • ఈ నెల 26 నుంచి హాల్‌ టికెట్లు

హైదరాబాద్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టెట్‌ పరీక్షలు జనవరి 2 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 నుంచి 20వరకు జరగనున్న పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు బుధవారం విడుదల చేశారు. రోజూ రెండు సెషన్‌లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్‌ హాల్‌టికెట్లను ఈ నెల 26 నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తారు.

Updated Date - Dec 19 , 2024 | 05:35 AM