Share News

CM Relief Fund: సీఎం సహాయ నిధికి 52.02 లక్షల విరాళం

ABN , Publish Date - Dec 17 , 2024 | 03:34 AM

బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సీఎం సహాయనిధికి అందరూ సహాయ, సహకారాలు అందజేయాలని తెలంగాణ స్టేట్‌ హైర్‌ బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

CM Relief Fund: సీఎం సహాయ నిధికి 52.02 లక్షల విరాళం

  • అందజేసిన తెలంగాణ స్టేట్‌ హైర్‌ బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

వనస్థలిపురం, డిసెంబరు 16(ఆంధ్ర జ్యోతి): బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సీఎం సహాయనిధికి అందరూ సహాయ, సహకారాలు అందజేయాలని తెలంగాణ స్టేట్‌ హైర్‌ బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరకంఠం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌లను కలిసి సీఎం సహాయనిధికి రూ. 52,02,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, మద్యతరగతి ప్రజలకు ప్రమాదంలో ఉన్నప్పుడు వారికి మెరుగైన వైద్యం అందించడానికి విశేష సేవలను అందిస్తున్న సీఎం సహాయ నిధికి తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేశామన్నారు. మానవతా దృక్పథంతో సీఎం సహాయనిధికి సహాయం అందజేయడం అభినందనీయమని సీఎం రేవంత్‌, మంత్రి పొన్నం అన్నారని తెలిపారు.

Updated Date - Dec 17 , 2024 | 03:35 AM