Mission Bhagiratha: మిషన్ భగీరథకు టోల్‌ఫ్రీ నంబర్
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:12 AM
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మిషన్ భగీరథ మంచినీటిపై నమ్మకాన్ని పెంచి.. వారు ఆ నీటిని వినియోగించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మిషన్ భగీరథ మంచినీటిపై నమ్మకాన్ని పెంచి.. వారు ఆ నీటిని వినియోగించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే.. మిషన్ భగీరథ నీటికి సంబంధించిన సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులను సేకరించి.. వాటిని తక్షణం పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4007ను ఏర్పాటు చేసింది.
మంత్రి ధనసరి అనుసూయసీతక్క ఆదేశం మేరకు ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ఈఎన్‌సీ ప్రధాన కార్యాలయంలో సిద్ధం చేసిన కాల్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా అందే ఫిర్యాదులను క్షేత్రస్థాయికి చేర్చి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.