TG News: గృహజ్యోతికి రూ.172.58 కోట్లు
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:52 AM
రాష్ట్రంలో 200 యూనిట్ల దాకా గృహ విద్యుత్తును వినియోగించే వారి కరెంట్ బిల్లుల కోసం ప్రభుత్వం రూ.172.58 కోట్లను విడుదల చేసింది.
డిసెంబరు నెలకు విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 200 యూనిట్ల దాకా గృహ విద్యుత్తును వినియోగించే వారి కరెంట్ బిల్లుల కోసం ప్రభుత్వం రూ.172.58 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండి 200 యూనిట్ల దాకా కరెంట్ వాడే వారికి ఈ ఏడాది మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే డిసెంబరు నెలకు గాను విద్యుత్ సంస్థలకు ఈ నిఽధులను విడుదల చేసింది.