Share News

Sridhar Babu: మీ సేవ నిర్వాహకుల కమీషన్‌ పెంచేందుకు సిద్ధం

ABN , Publish Date - Nov 05 , 2024 | 03:53 AM

మీ సేవ నిర్వాహకుల కమీషన్‌ను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. త్వరలోనే తెలంగాణ మీ సేవ ఫెడరేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎంతమేరకు కమీషన్‌ పెంచాలనే విషయాన్ని చర్చించి జనవరి నుంచి అమలు చేస్తామని తెలిపారు.

Sridhar Babu: మీ సేవ నిర్వాహకుల కమీషన్‌ పెంచేందుకు సిద్ధం

  • జనవరి నుంచి పెంచిన కమీషన్‌ అమలు

  • త్వరలో మీసేవ ఫెడరేషన్‌ ప్రతినిధులతో చర్చలు

  • ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

రాంనగర్‌, నవంబరు4(ఆంధ్రజ్యోతి): మీ సేవ నిర్వాహకుల కమీషన్‌ను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. త్వరలోనే తెలంగాణ మీ సేవ ఫెడరేషన్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎంతమేరకు కమీషన్‌ పెంచాలనే విషయాన్ని చర్చించి జనవరి నుంచి అమలు చేస్తామని తెలిపారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో తెలంగాణ మీ సేవ ఫెడరేషన్‌ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మీ సేవలో నూతనంగా అందించే సేవలకు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ సర్వీసులను ఒకే గొడుగు కిందకు తీసుకురావలన్న సంకల్పంతో 2011లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మీ సేవను ప్రారంభించిందని మంత్రి గుర్తు చేశారు. మీ సేవల ద్వారా దళారుల ఆట కట్టించామన్నారు. మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు హెల్త్‌ కార్డులతోపాటు ఇతర పథకాలు అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మీ సేవా నిర్వాహకులకు కనీస వేతనాలు వచ్చే విధంగా కమిషన్‌ను నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు.

Updated Date - Nov 05 , 2024 | 03:53 AM