Share News

Green Energy: 2030 నాటికి 20 గిగావాట్ల హరిత విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Dec 14 , 2024 | 04:06 AM

రాష్ట్రంలో 2030 నాటికి 20 గిగావాట్ల హరిత విద్యుత్‌ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Green Energy: 2030 నాటికి 20 గిగావాట్ల హరిత విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 2030 నాటికి 20 గిగావాట్ల హరిత విద్యుత్‌ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20 దాకా జరిగే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీజీరెడ్‌కో) రూపొందించిన 2025 సంవత్సరం ఇంధన పొదుపు క్యాలెండర్‌ను ఆయన శుక్రవారం ప్రజాభవన్‌లో ఆవిష్కరించి మాట్లాడారు.


2030 నాటికి 20 గిగావాట్లు, 2035 నాటికి 40 గిగావాట్ల హరిత విద్యుత్‌ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్‌కో అమలు చేసిన కార్యక్రమాలను ఆ సంస్థ సీఎండీ వి.అనిల వివరించారు. చల్లని పైకప్పు(కూల్‌ రూఫ్‌ పాలసీ) విధానాన్ని దేశంలో అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణయేనని గుర్తుచేశారు.

Updated Date - Dec 14 , 2024 | 04:06 AM