Ponnam Prabhakar: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి
ABN , Publish Date - Oct 26 , 2024 | 03:26 AM
ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ ఉమ్మడి కార్యాచరణ సంఘం(జేఏసీ) డిమాండ్ చేసింది.
రవాణా మంత్రి పొన్నంకు ఆర్టీసీ జేఏసీ వినతి
హైదరాబాద్, అక్టోబర్ 25(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ ఉమ్మడి కార్యాచరణ సంఘం(జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు టీజీఎ్‌సఆర్టీసీ జేఎసీ ప్రతినిధుల బృందం శుక్రవారం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్ కు వేర్వేరుగా వినతి పత్రాలను సమర్పించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే ప్రక్రియను ప్రారంభించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న కోరారు.
ఆలస్యమైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా విలీన ప్రక్రియ చేపడాతరనే విశ్వాసం ఉందని అన్నారు. మరోవైపు ఇక నుంచి టీఎన్‌జీవోతో కలిసి పని చేయనున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో సంయుక్తంగా పోరాట కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. శుక్రవారం టీఎన్‌జీవో్‌స కార్యాలయంలో జరిగిన రెండు జేఏసీల ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని తెలిపారు.