Home » TGSRTC
ఆన్లైన్ వేదికగా జరిగే బెట్టింగ్లకు యువత దూరంగా ఉండాలని, అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు కొందరు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారంటూ టీజీఎస్ఆర్టీసీ ఎం.డి. వీసీ సజ్జనార్(TGSRTC MD VC Sajjanar) ఎక్స్ (ట్విటర్)లో వీడియోను పోస్టు చేశారు.
కూకట్పల్లి(Kukatpally) ఆర్టీసీ డివిజన్ పరిధి లింగంపల్లి నుంచి ఎన్జీవో కాలనీ వరకు గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ ఆర్ఎం కవితరూపుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని, సీఎం రేవంత్ కల్పించుకుని తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పార్సిళ్లను హోమ్ డెలివరీ చేసేందుకు సేవలకు శ్రీకారం చుట్టింది. దీపావళి సందర్భంగా అంటే అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ సేవలను టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలోని ఏడు డిపోల అధికారులతో నగరంలోని ప్రాంతీయ మేనేజరు కార్యాలయంలో బస్సుల ఏర్పాట్లపై ఆర్ఎం సరిరాం(RM Sariram) ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఇంటికే RTC పార్శిళ్లు పార్శిళ్ల డెలివరీని మెరుగుపరిచేందుకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ ఉమ్మడి కార్యాచరణ సంఘం(జేఏసీ) డిమాండ్ చేసింది.
బతుకమ్మ, దసరా పండగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, సంతోష్ నగర్ నుంచి పలు ప్రాంతాలకు బస్సులను నడిపింది.
తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే జనాలు జడుసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమనే భావన ఉన్నప్పటికీ.. ఇబ్బంది పడుతూ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు నడపడం లేదనే ఆరోపణలు అధికమవుతున్నాయి.
రోడ్డు రవాణా సంస్థలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం శుభపరిణామమని గచ్చిబౌలి డిపో మేనేజర్ మురళీధర్రెడ్డి అన్నారు. గచ్చిబౌలి బస్డిపోలో(Gachibowli Bus Depot) మొత్తం 69 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టారు. మూడు దఫాలుగా ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.