Share News

TGSRTC: ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:09 PM

సోమవారం ఉదయం గద్వాల్ డిపోకు చెందిన గద్వాల్ - వనపర్తి రూట్‌లో పల్లె వెలుగు బస్సులో నిండు గర్బిణీ సంధ్య.. రక్ష బంధన్ సందర్భంగా సోదరులతో రాఖీ కట్టించుకునేందుకు వనపర్తికి బయలుదేరింది. బస్సు నాచుపల్లి సమీపంలోకి రాగానే ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. బస్సు కండక్టర్ జి. భారతీ వెంటనే స్పందించారు. బస్సును పక్కకు ఆపి.. మిగిలిన ప్రయాణికులకు దింపేశారు అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో సంధ్యకు పురుడు పోశారు.

TGSRTC: ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

రక్షా బంధన్ రోజు.. ఓ మహిళా కండెక్టర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సులోని నిండు గర్బిణికి నొప్పులు వచ్చాయి. దీంతో బస్సు కండెక్టర్ సమయస్పూర్తితో వ్యవహరించి.. ఆ నిండు గర్బిణీకి పురుడు పోశారు. దీంతో తల్లీ బిడ్డల ప్రాణాలను ఆమె కాపాడారు. సోమవారం ఉదయం గద్వాల్ డిపోకు చెందిన గద్వాల్ - వనపర్తి రూట్‌లో పల్లె వెలుగు బస్సులో నిండు గర్బిణీ సంధ్య.. రక్ష బంధన్ సందర్భంగా సోదరులతో రాఖీ కట్టించుకునేందుకు వనపర్తికి బయలుదేరింది.


బస్సు నాచుపల్లి సమీపంలోకి రాగానే ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. బస్సు కండక్టర్ జి. భారతీ వెంటనే స్పందించారు. బస్సును పక్కకు ఆపి.. మిగిలిన ప్రయాణికులకు దింపేశారు అదే బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో సంధ్యకు పురుడు పోశారు. సంధ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 108 సాయంతో ఆ తల్లిబిడ్డలను వనపర్తిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఈ సందర్భంగా ఆ బిడ్డను కండక్టర్ ఎత్తుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వి.సి. సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ఓ మహిళ కండక్టర్ తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు" అని ఆ పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు.


టీజీఎస్ఆర్టీసీ బస్సులో గర్బిణికి పురుడు పోసిన వనపర్తి డిపోకు చెందిన కండక్టర్ భారతిని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి తల్లిబిడ్డల ప్రాణాలను కాపాడిన కండక్టర్‌ను ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తారు.

మరోవైపు సంధ్యకు బస్సులో నొప్పులు రావడం.. ఆమె ఆడ బిడ్డకు జన్మనివ్వడం.. 108 ద్వారా సమీపంలోకి ఆసుపత్రికి వారిని తరలించడంపై ఆమె కుటుంబ సభ్యులు సమాచారం అందుకున్నారు. వారు సైతం ఆసుపత్రికి చేరుకున్నారు.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 03:24 PM