Share News

Hyderabad: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

ABN , Publish Date - May 29 , 2024 | 09:58 AM

మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్‌ సింగ్‌(ADE Banothu Charan Singh) తెలిపారు.

Hyderabad: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే...

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్‌ సింగ్‌(ADE Banothu Charan Singh) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 11 కేవీ గణేష్ నగర్‌ ఫీడర్‌ పరిధిలోని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ ఎస్‌ఆర్‌ నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి, అవంతినగర్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంట ల వరకు 11 కేవీ సారధి నగర్‌, శాం తిబాగ్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు భరత్‌ నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: TS Accident: సైదాబాద్ - జయనగర్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం


- బంజారాహిల్స్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11కేవీ పంజాగుట్ట సాయిబాబా టెంపుల్‌, టెలీఫోన్‌ ఎక్స్‌ చేంజి, అన్నపూర్ణ స్టూడియోస్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 11 కేవీ సీఆర్పీఎఫ్‌, కృష్ణానగర్‌-సీ బ్లాక్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ శ్రీరామ్‌నగర్‌, యూసుఫ్‌గూడ టీజీఎస్పీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.


- సైఫాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ప్రేమానంద్‌ పాయ్‌ తెలిపా రు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 30 గంటల వరకు 11 కేవీ ఆదర్శ్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలో, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ ఖైరతాబాద్‌ మారుతినగర్‌, లేక్‌ప్లాజా ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 3 గంట ల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 11 కేవీ లక్డికాపూల్‌ మీరా టాకీస్‌ ఫీడర్‌ పరిధిలో పలు ప్రాంతా ల్లో విద్యుత్‌ ఉండదన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 29 , 2024 | 09:58 AM