Share News

వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే!

ABN , Publish Date - May 14 , 2024 | 02:48 AM

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.

వాహనాలన్నీ హైదరాబాద్‌ వైపే!

ఊళ్ల నుంచి తిరిగి వస్తున్న ఓటర్లు

చౌటుప్పల్‌ రూరల్‌/టౌన్‌, మే 13: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద అర కిలోమీటరు మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. టోల్‌ గేటు దాటడానికి 15 నిమిషాల సమయం పట్టింది. సాధారణ రోజుల్లో నిత్యం 30 నుంచి 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సోమవారం 45 వేల వాహనాలు హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు టోల్‌గేట్‌ సిబ్బంది తెలిపారు. అర్ధరాత్రి వరకు వాహనాల రద్దీ కొనసాగింది.

Updated Date - May 14 , 2024 | 02:49 AM