Share News

Tiger Sighting: పెంచికలపేటలో పులి సంచారం

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:19 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలంలోని కొండపల్లి, ఎర్రగుట్ట, పోతెపల్లి, దర్గపల్లి, లోడ్‌పల్లి గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో సోమవారం పులి కదలికలు కలకలం రేపాయి.

Tiger Sighting: పెంచికలపేటలో పులి సంచారం

  • ఆసిఫాబాద్‌ మండలంలో చిరుతపులి!

పెంచికలపేట, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలంలోని కొండపల్లి, ఎర్రగుట్ట, పోతెపల్లి, దర్గపల్లి, లోడ్‌పల్లి గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో సోమవారం పులి కదలికలు కలకలం రేపాయి. అటవీ అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. ఆదివారం రాత్రి కొండపల్లి అటవీ ప్రాంతంలో ట్రాకింగ్‌ చేస్తుండగా పులి పాదముద్రలను గుర్తించారు.


వాటిని అనుసరిస్తూ వెళ్లగా ఎర్రగుంట గ్రామశివారులోని ఓ కుంట వద్ద పులి నీళ్లు తాగి మళ్లీ సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం అధికారులు సిబ్బందితో కలిసి పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పలు ప్రాంతాల్లో పులి పాదముద్రలను గుర్తించారు. మరోవైపు, ఆసిఫాబాద్‌ మండలంలోని మాణిక్‌గూడ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీరేంజ్‌ అధికారి గోవింద్‌చంద్‌ సర్దార్‌ తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 05:19 AM