Share News

CM Revanth Reddy: కుంభమేళాకు రండి

ABN , Publish Date - Dec 07 , 2024 | 03:49 AM

ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే కుంభమేళాకు హాజరుకావాలని సీఎం రేవంత్‌ రెడ్డిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

CM Revanth Reddy: కుంభమేళాకు రండి

  • సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన యూపీ ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే కుంభమేళాకు హాజరుకావాలని సీఎం రేవంత్‌ రెడ్డిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య శుక్రవారం రేవంత్‌ను ఆయన నివాసంలో కలిసి కుంభమేళా ఆహ్వానాన్ని అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో గల ప్రయాగ వద్ద ఈ కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనుంది.

Updated Date - Dec 07 , 2024 | 03:49 AM