Share News

Mahashivaratri: మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం

ABN , Publish Date - Mar 07 , 2024 | 07:46 AM

మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Mahashivaratri:  మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం

రాజన్న సిరిసిల్ల: మహాశివరాత్రి (MahaShivaratri) వేడుకలకు వేములవాడ (Vemulavada) శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ( Rajarajeswara Swamy Temple) ముస్తాబైంది. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ (TTD) తరపున పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. రెండువేల మంది పోలీసులతో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ సుమారు వెయ్యి బస్సులను ఏర్పాటు చేసింది. రాజన్న దర్శనానికి నాలుగున్నర లక్షల మంది వస్తారని అధికారుల అంచనా. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను చేశారు.

CM Revanth Reddy: ఎవడన్న టచ్‌ చేసి చూడండి. మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలైతరు.. సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 07:46 AM