Share News

Kaleshwaram: మేడిగడ్డ కుంగుబాటుపై రంగంలోకి డీజీ.. రెండ్రోజులపాటు అక్కడే

ABN , Publish Date - Jan 17 , 2024 | 05:38 PM

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwara Project)లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ రంగంలోకి దిగారు.

Kaleshwaram: మేడిగడ్డ కుంగుబాటుపై రంగంలోకి డీజీ.. రెండ్రోజులపాటు అక్కడే

జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwara Project)లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఎస్పీ శ్రీనివాసులుతో కలిసి కాళేశ్వరం హరిత హోటల్‌లో ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

మేడిగడ్డతోపాటు కన్నెపల్లి పంప్ హౌస్ మునకకు కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీని విజిలెన్స్ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. వారంతా రెండ్రోజులపాటు విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 17 , 2024 | 05:39 PM