Home » Kaleshwaram Project
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైన్లకు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం లేదని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నా తొలుత సరైన ఇన్వెస్టిగేషన్లు జరగాలని, ఆ ఫలితాల ఆధారంగా డిజైన్లు/డ్రాయింగ్లు పూర్తయ్యాక నిర్మాణం జరగాల్సి ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలోభాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో స్మితా సబర్వాల్‌ను కమిషన్ విచారిస్తోంది.
మామ చాటు అల్లుడిగా 10 వేల కోట్లు దోచుకున్నావ్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఇవాళ (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది.
Telangana: కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ దఫా విచారణలో కీలక ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లను కమిషన్ విచారించనుంది. ఈరోజు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషిని విచారించింది.
చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడంతో ఆ పథకానికి ఇన్వె్‌స్టమెంట్ క్లియరెన్స్ తీసుకోవ డానికి వీలుగా ప్రతిపాద నలను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో అవకతవకతలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ 18 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్‌ను ప్రక్రియను పునః ప్రారంభించనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ నెల 17న హైదరాబాద్‌కు రానున్నారు. ఈనెల 24వరకు హైదరాబాద్‌లోనే ఉండి విచారణ చేపట్టనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు నిపుణుల కమిటీకి అందించడంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ జాప్యం చేస్తోందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) నిపుణుల కమి టీ తెలిపింది.
బ్యారేజీలను డ్యామ్‌లుగా ఏ విధంగా గుర్తించారు? 2019లో బ్యారేజీలు పూర్తయితే 2021లో జాతీయ ఆనకట్టల భద్రత చట్టం (ఎన్డీఎ్సఏ) వచ్చింది.. 2023 జూలైలో కాళేశ్వరం బ్యారేజీలను స్పెసిఫైడ్ డ్యామ్‌లుగా గుర్తించడం వెనుక ఆంతర్యం ఏమిటి?