TS News: 16 నుంచి 21 వరకు పిల్లర్స్‌కు నష్టం.. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక
ABN , Publish Date - Feb 08 , 2024 | 09:15 PM
కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. 16 నుంచి 21 వరకు పిల్లర్స్‌కు నష్టం వాటిలినట్టు తమ నివేదికలో విజిలెన్స్ పేర్కొంది. రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోవడం వల్ల నష్టం జరిగినట్టు తెలిపింది.
కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. 16 నుంచి 21 వరకు పిల్లర్స్‌కు నష్టం వాటిలినట్టు తమ నివేదికలో విజిలెన్స్ పేర్కొంది. రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోవడం వల్ల నష్టం జరిగినట్టు తెలిపింది. ఏజెన్సీ అత్యంత నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది. గత మూడేళ్లుగా నిర్లక్ష్యం చోటు చేసుకుందని వెల్లడించింది. 18-05-2020న నష్టాన్ని గుర్తించి పనులు చేయాలని ఏజెన్సీకి హెచ్చరించిన పట్టించుకోలేదని తెలిపింది. పిల్లర్స్ వద్ద ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం వల్లే ఈ నష్టం జరిగినట్టు పేర్కొంది. నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరం విషయంలో ఈఎన్‌సీ తప్పిదాలు స్పష్టంగా ఉన్నాయి. ఈఎన్‌సీ చూడకుండానే పనులు పూర్తయ్యాయని నివేదిక ఇచ్చారు. ఏజెన్సీకి లబ్ది జరిగేలా అధికారులు ప్రవర్తించారు. ఒప్పంద నియమాలను కూడా ఏజెన్సీ ఉల్లంగించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.