Share News

Vikarabad: వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డిపై అవిశ్వాసం..

ABN , Publish Date - Feb 18 , 2024 | 11:54 AM

వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి(Patnam Sunita Mahender Reddy)పై బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు.

Vikarabad: వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డిపై అవిశ్వాసం..

- కాంగ్రెస్‏లో చేరిన మరుసటి రోజే బీఆర్‌ఎస్‌ ప్రతిపాదన..

- వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌కు తీర్మాన ప్రతి అందజేత

వికారాబాద్‌: వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి(Patnam Sunita Mahender Reddy)పై బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించారు. మొత్తం 12 మంది జడ్పీటీసీలు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ సంతకాలు చేసిన తీర్మాన పత్రాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌కు అందజేశారు. కాంగ్రెస్‏లో చేరిన మరుసటి రోజే వ్యూహాత్మకంగా వికారాబాద్‌, తాండూరు మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీలు సునీతపై అవిశ్వాసం ప్రకటించారు. ఈ తీర్మానంపై బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీలు జడ్పీ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయకుమార్‌(మోమిన్‌పేట), కె.నాగిరెడ్డి(దోమ), కె.మహిపాల్‌(దౌల్తాబాద్‌), ఎం.మేఘమాల(పూడూరు), కె.సుజాత (ధారూరు), కె.జయమ్మ(నవాబుపేట), నాగరాణి(కొడంగల్‌), హరిప్రియ(పరిగి), మంజుల(తాండూరు), ప్రమోదిని(వికారాబాద్‌), పి.మధుకర్‌(మర్పల్లి), కె.రాందా్‌స(కులకచర్ల) సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానం అందజేసిన 15 రోజుల్లో అధికారులు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ అంశంలో అధికారులు ఏ విధంగా వ్యవహరించనున్నారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా పరిషత్‌లో బీఆర్‌ఎ్‌సకు 14మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్ కు నలుగురు సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ లో చేరిన సునీతా మహేందర్‌రెడ్డి బేషరతుగా చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేయాలని జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌ డిమాండ్‌చేశారు. రాజీనామా చేయకుండానే ఆమె పార్టీ మారడాన్ని ఖండిస్తూ అవిశ్వాసం ప్రకటించామన్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేసిన తర్వాతే కాంగ్రెస్ లో చేరాలని సూచించారు. బీఆర్‌ఎ్‌సలో చేరినప్పుడు ఏమి ఆశించి వచ్చారో... అదే ఆశించి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లారని విమర్శించారు. పట్నం దంపతులకు పదవీ వ్యామోహమే తప్ప.. ప్రజలపై ప్రేమ లేదని దుయ్యబట్టారు.

Updated Date - Feb 18 , 2024 | 11:54 AM