Share News

తప్పని నిరీక్షణ!

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:50 PM

నిరుపేదల కు నిరీక్షణ తప్పడం లేదు. కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. దీంతో దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్‌) కుటుంబాలకు నిరాశే ఎదురవుతోంది.

తప్పని నిరీక్షణ!

రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు

తొమ్మిదేళ్లుగా రేషన్‌కార్డులు నోచుకోని బీపీఎల్‌ కుటుంబాలు

ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న పేదలు

పెండింగ్‌ దరఖాస్తులు 22 వేలకు పైనే..

భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం ఉన్న కార్డులు 1,23,659

భూపాలపల్లి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల కు నిరీక్షణ తప్పడం లేదు. కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. దీంతో దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్‌) కుటుంబాలకు నిరాశే ఎదురవుతోంది. ఆహారభద్రతతోపాటు సంక్షేమ పథకాలకు ఈ కార్డే కీలకం కావడంతో దీనికి ప్రాధా న్యం సంతరించుకుంది. రేషన్‌కార్డులు జారీకాక అనేక కుటుంబాలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నా రు. రైతులు సైతం సర్కారు ఇచ్చే సబ్సిడీకి నోచుకోవ డం లేదు. ఇదే క్రమంలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటించడంతో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.

తెలంగాణ ఏర్పాటు అయ్యాక కొత్త రేషన్‌కార్డుల జారీ స్తంభించిపోయింది. 2012లో బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కొలువుదీరాక అంతంత మాత్రంగానే కార్డులు మంజూరు చేసింది. ఆ తర్వాత ఈ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో తొమ్మిదేళ్లుగా అనేక కుటుంబా లు కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే... ఆరు నెలలుగా ఇదిగో కార్డు.. అదిగో కార్డు అంటూ ఊరించడం తప్ప మోక్షం కలగడం లేదు. రేషన్‌కార్డులు జారీకి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలను రేవంత్‌రెడ్డి సర్కారు ప్రకటించకపోవడంతో దరఖాస్తుదారుల్లో నైరాశ్యం నెలకొంది. తొమ్మిదేళ్ల కాలంలో కొత్త కార్డుల కోసం అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆయా సంక్షేమ పథకాలతోపాటు కార్డుల కోసం మళ్లీ అర్జీ పెట్టుకున్నా రు. ఇది వరకు దరఖాస్తు చేసుకోని వారే కాకుండా కొత్తవారు కూడా అప్లయ్‌ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే కొత్తకార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అందుకు సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

22వేలకు పైగా దరఖాస్తులు..

భూపాలపల్లి జిల్లాలోని 12 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,23,659 తెల్లరేషన్‌ కార్డులు ఉండగా ప్రతినెలా 2 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. కార్డులేక దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 22 మంది ఉన్నారు. ఇప్పటికే కార్డులు ఉన్నవారికి ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా కొత్తగా రేషన్‌కార్డుల కోసం భూపాలపల్లి జిల్లాలో భారీగానే దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల పథకంలో రేషన్‌కార్డులే కీలకం కావడంతో వాటి కోసం దరఖాస్తుదారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉచిత విద్యుత్‌, పెన్షన్ల మంజూరు, ఆరోగ్యశ్రీ, గ్యాస్‌ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డులు తప్పనిసరి. దీంతో ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందా..? అని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్డుల జారీపై ప్రకటన జారీ చేయడంతో దరఖాస్తుదారుల్లో ఆశ నెలకొంది. అయితే.. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతోందో స్పష్టత లేదు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్‌కార్డుల లింక్‌ ఓపెన్‌ కావడం లేదు.

ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికం కావడంతో వాటిని త్వరిగతగతిన మంజూరు చేయాలని పేదలు కోరుతున్నారు. తొమ్మిదేళ్లుగా కొత్త జంటలు రేషన్‌ కార్డులు పొంద లేక పోవడంతో సంక్షేమ పథ కాలు అందక వారు నష్ట పోతున్నారు. మృతుల పేర్లు తొలగించి, కొత్త పేర్లు చేర్చి అర్హులైన వారికి రేషన్‌కార్డులు జారీ చేయాల నే డిమాండ్‌ ప్రజల్లో ఉంది.

Updated Date - Jun 12 , 2024 | 11:50 PM