Share News

అస్తవ్యస్థం... అధ్వానం

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:59 PM

పల్లెల్లో పారిశుధ్యం లోపిస్తోంది. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోతోంది. దీంతో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. అసలై వర్షాకాలం.. ఆపై పారిశుఽధ్య లోపం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో చాలా మంది సీజనల్‌ వ్యాఽధులతో సతమతమవుతున్నారు.

అస్తవ్యస్థం... అధ్వానం
భూపాలపల్లి మండలంలోని కొంపెల్లి గ్రామంలో చెత్తా చెదారం పేరుకపోయి నిండిపోయిన డ్రైనేజీ

పల్లెల్లో లోపిస్తున్న పారిశుఽధ్య నిర్వహణ

పేరుకుపోతున్న వ్యర్థాలు

నిండిపోతున్న డ్రెయినేజీలు

పట్టించుకోని యంత్రాంగం

కృష్ణకాలనీ (భూపాలపల్లి), అక్టోబరు 5: పల్లెల్లో పారిశుధ్యం లోపిస్తోంది. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోతోంది. దీంతో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. అసలై వర్షాకాలం.. ఆపై పారిశుఽధ్య లోపం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో చాలా మంది సీజనల్‌ వ్యాఽధులతో సతమతమవుతున్నారు. ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకవైపు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు, మరోవైపు పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో రోగాలు విస్తరిస్తున్నాయి. గ్రామాల్లో కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా చల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పారిశుధ్యం లోపించడం వల్ల చాలా మంది మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు.

పాలకులు లేరు.. ప్రత్యేకాధికారులూ రారు..

పంచాయతీల కాలపరిమితి జూలై 5న ముగిసిన నేపథ్యంలో గ్రామాల్లో పాలవర్గాలు లేవు. దీంతో ప్రజాప్రతిధులు మాజీలయ్యారు. దీంతో పల్లెల్లోని సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. ప్రత్యేకాధికా రులుగా నియామకం పొందిన వారు విఽధులను సక్రమంగా నిర్వర్తించ డం లేదని తెలుస్తోంది. ఒక్కో ప్రత్యేకాధికారికి రెండు, మూడు గ్రామాలను కేటాయించడంతో పూర్తి స్థాయిలో నిర్వహణ జరగడం లేదు. దీంతో పెద్దగా దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులంతా ఓటరు జాబితా సవరణల కార్యక్రమంలో నిమగ్నం కావడంతో పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారిం ది. అలాగే చెత్తను సేకరించే కార్మికులకు సకాలంలో వేతనాలు అందడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాలు గ్రామాల్లో పారిశుధ్య లోపానికి దారి తీస్తున్నాయి. చెత్తను సేకరించడం, మురుగు కాల్వలు శుభ్రం చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించడం తదితర పనులు సక్ర మంగా సాగడం లేదని తెలుస్తోంది. వీటన్నింటికీ తోడు గ్రామ పం చాయతీకి వచ్చే నిధులకు బ్రేక్‌ పడటం కూడా శాపంగా మారింది.

కనీసం బ్లీచింగ్‌ చల్లడం లేదు

- స్వరూప, కొంపెల్లి (భూపాలపల్లి మండలం)

వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉంటున్నాయి. డ్రెయినేజీలో మురుగునీరు పేరుకపోయి రోడ్లపైకి చేరి దుర్వాసన వస్తోంది. అయినప్పటికీ కనీసం బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా చల్లడం లేదు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించడం లేదు. దీంతో దోమలు విజృంభించి రోగాల బారిన పడుతున్నాం. మా బాధను ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.

Updated Date - Sep 05 , 2024 | 11:59 PM