Share News

కరెంటు కష్టాలకు చెక్‌!

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:10 AM

విద్యుత్‌ శాఖ ఆధునీకత వైపు పయనం ప్రారంభించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పునికిపుచ్చుకుంది. విద్యుత్‌ సమస్యలకు చెక్‌ పెట్టడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర నార్తర్న్‌ పవర్‌ డిస్ర్టిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీ ఎన్‌పీడీసీఎల్‌) కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది.

కరెంటు కష్టాలకు చెక్‌!

సాంకేతికత వైపు విద్యుత్‌ శాఖ అడుగులు

సైదీ, సైఫీ సిస్టమ్స్‌కు శ్రీకారం

ప్రతి సమస్యకూ ఆన్‌లైన్‌లోనే పరిష్కారం

తగ్గనున్న నష్టాలు.. కష్టాలు

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌!

భూపాలపల్లిటౌన్‌, సెప్టెంబరు 4: విద్యుత్‌ శాఖ ఆధునీకత వైపు పయనం ప్రారంభించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పునికిపుచ్చుకుంది. విద్యుత్‌ సమస్యలకు చెక్‌ పెట్టడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర నార్తర్న్‌ పవర్‌ డిస్ర్టిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీ ఎన్‌పీడీసీఎల్‌) కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. ఇందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. తద్వారా సాంకేతిక లోపాలను ఎప్పటికప్పుడు సరిచేయడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించొచ్చని అధికారులు అంటున్నారు.

వినియోగదారులకు అత్యుత్తమ సేవలు

విద్యుత్‌ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడానికి సాంకేతిక పద్ధతులు అవలంబిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా సైది (సిస్టం యావరేజ్‌ ఇంటరాప్షన్‌ డ్యూరేషన్‌ ఇండెక్స్‌), సైఫీ (సిస్టం యావరేజ్‌ ఇంటరాప్షన్‌ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్‌) అనే పద్ధతులను ప్రవేశపెట్టారు. తద్వారా విద్యుత్‌ను సరఫరా, వినియోగం తదితర ప్రమాణాలను తెలుసుకోవచ్చని అంటున్నారు. విద్యుత్‌ సరఫరాలో ఎన్ని అంతరాయాలు జరిగాయి.. ఎంత సమయంపాటు అవి కొనసాగాయి? తదితర అంశా లతో రియల్‌టైం డేటాను క్రోడీకరిస్తారు. ఈ గణాంకాల ఆధారంగా విశదీకరించి అంతరాయాలు కలకుండా సత్వర చర్యలు చేపడతారు. దీంతో విద్యుత్‌ అంతరాయాలు కనిష్ఠస్థాయికి తీసుకురావచ్చని ఆ శాఖ అధికారులు అంటున్నారు.

అంతా యాప్‌లోనే...

విద్యుత్‌ సమస్యల పరిష్కారమే కాకుండా నాణ్య మైన కరెంటును అందించేందుకు ‘టీజీఎన్‌పీడీసీఎల్‌ యాప్‌’ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా నేరు గా వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొ చ్చు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి ఆ సమస్యకు చెక్‌ పెడతారు. విద్యుత్‌ అంతరాయాలను సైతం వెంటనే పరిష్కరిస్తారు.. పనులు ఆలస్యం కాకుండా సకాలంలో పూర్తికావడానికి ఈ యాప్‌ ఎంతో దోహద పడుతుందని నిపుణులు చెబుతు న్నారు. గతంలోలాగా పేపర్‌తో పనిలేకుండా అధికా రులు సైతం ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారులకు మెసేజ్‌ల రూపంలో రిపోర్టు చేయొచ్చని అంటు న్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొం టున్నారు. ఈ యాప్‌ను మరింత అప్‌డేట్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిస్కమ్‌లకు సంబంధించిన ప్రతి సమాచారాన్నీ ఇందులోనే చూసేలా రూపొందించనున్నారు. దీని ద్వారా వర్క్‌ఫోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఔటేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం, డిమాండ్‌ సైడ్‌ మేనేజ్‌మెంట్‌, వినియో గదారుల పోర్టల్‌, సిటిజన్‌ మేనేజ్‌మెంట్‌, అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సమగ్ర వివరాలు తెలుసుకునే వీలుం టుందని అధికారులు చెబుతున్నారు. బిల్లింగ్‌, కలెక్ష న్‌, అంతరాయాలు, ఫిర్యాదుల వివరాలు, కమాండ్‌ కంట్రోల్‌.. ఇలా ఒకేచోటా ప్రతి సమాచారాన్నీ ఇందు లోనే తెలుసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అంతరాయాలు, లోటుపాట్లు ఉన్నా వెంటనే తెలిసిపోతుందని అంటున్నారు.

లోవోల్టేజీ నివారణకు కెపాసిటర్‌ బ్యాంకులు

లోవోల్టేజీ నివారణకు కెపాసిటర్‌ బ్యాంకు లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది రైతులకు ఎంతోమేలు చేస్తాయని విద్యుత్‌ శాఖ అధికారులు అంటున్నారు. మోటార్లు వినియోగించే సమయంలో ఒకవేళ లోవో ల్టేజీ వస్తే వెంటనే ఈ కెపాసిటర్లు విద్యు త్‌ను మెరుగుపరచడంలో దోహదం చేస్తా యని తెలిపారు. దీంతో టెక్నికల్‌ నష్టాలు కూడా తగ్గుతాయనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. వ్యవసాయ పంప్‌సెట్లకు, పారిశ్రామిక ఫీడర్లకు కలిగే నష్టాలను ఇది నివారిస్తుంది. వర్షాలు, ఈదురుగాలులు, సాంకేతికతంగా విద్యుత్‌ సమస్యలు తలెత్తిన ప్పుడు ప్రత్యామ్నాయ సరఫరా అందించడం వల్ల వినియోగదారులు సంతృప్తిగా పనులు చేసుకోగ లుగుతారని చెబుతున్నారు. దీని కోసం 33కేవీ, 11కేవీ ఇంటర్‌లింకుల పనులు వేగంగా జరుగుతు న్నాయని తెలిపారు. దీంతో అసెట్‌ మ్యాపింగ్‌ ట్రాకింగ్‌లో అన్ని స్తంభాలకు యూనిక్‌ పోల్‌ నంబ ర్లు పెయింటింగ్‌ ప్రక్రియను చేపట్టామని అంటున్నా రు. పోల్స్‌ వారీగా పెట్రోలింగ్‌ సులభ ంగా చేపట్టొచ్చ ని చెబుతున్నారు. నిర్వహణను కూడా ట్రాక్‌చేసే వీలుటుందని తెలిపారు. గతంలో లాగా ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఆ లొకేషన్‌ను తెలుసుకుని, దానిని వెంటనే పరిష్కారం చేసుకోవచ్చని అంటున్నారు.

నాణ్యమైన విద్యుత్‌ కోసమే..

- మల్చూర్‌ నాయక్‌, విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్‌ (భూపాలపల్లి)

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతతో ముందుకెళ్తున్నాం. దీని ద్వారా ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం చేసే వీలుంటుంది. గతంలో ఏదైనా సమస్య తలెత్తితే అక్కడికి సిబ్బంది వెళ్లేవారు. ఏదైనా పరికరాలు కావాలన్నా ఉన్నతాధికారులకు లెటర్లు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు ఆన్‌లైన్‌ సౌకర్యం అందుబాటులోకి రావడంతో సిబ్బంది సమయం వృథా కాకుండా సమస్య సులువుగా వెంటనే పరిష్కారమవుతుంది. పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి మెరుగైన విద్యుత్‌ అందుతుంది.

Updated Date - Sep 05 , 2024 | 12:10 AM