Share News

పేదల ఇంట్లో విద్యుత్‌ వెలుగులు..!

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:09 AM

విద్యుత్‌ మీటర్లు లేని నిరుపేదలకు విద్యుత్‌ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌) సువర్ణ అవకాశం కల్పిస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు జీఎస్‌టీతో కలిపి రూ.937లకే గృహాలకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు నిర్ణయిం చారు. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్‌ సిబ్బంది గ్రామాల్లో తిరిగి ఇళ్లకు మీటరు లేని నిరుపేదలను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.

పేదల ఇంట్లో విద్యుత్‌ వెలుగులు..!

తక్కువ ధరకే విద్యుత్‌ మీటరు

నిరుపేదలకు సువర్ణావకాశం

గృహజ్యోతి ఫలాలు అందించేందుకు కసరత్తు

బీపీఎల్‌ కుటుంబాలకు ఇచ్చేలా కార్యాచరణ

దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే మీటరు ఏర్పాటు

ఈ నెల 15 వరకు దరఖాస్తులకు అవకాశం

జఫర్‌గడ్‌, సెప్టెంబరు 5 : విద్యుత్‌ మీటర్లు లేని నిరుపేదలకు విద్యుత్‌ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌) సువర్ణ అవకాశం కల్పిస్తోంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు జీఎస్‌టీతో కలిపి రూ.937లకే గృహాలకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు నిర్ణయిం చారు. ఈ నేపథ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి విద్యుత్‌ సిబ్బంది గ్రామాల్లో తిరిగి ఇళ్లకు మీటరు లేని నిరుపేదలను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా వారి నుంచి దరఖాస్తులు, మీటరు రుసుము తీసుకుని రసీదులు ఇవ్వడంతో పాటు రెండు రోజుల్లో వారి ఇంట్లో మీటరు బిగించేందుకు కార్యాచరణ చేపట్టారు. గతంలో ఇళ్ల విద్యుత్‌ కనెక్షన్‌ కోసం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని, కరెం టు లోడ్‌ ఆధారంగా రూ.వేలు చెల్లించాల్సి వచ్చేది. అయితే పేదలకు తాజాగా విద్యుత్‌ శాఖ అతి తక్కువ ధరకే మీటరు పొందడం సులభతరం చేసింది. 250 నుంచి 500 వాట్ల విద్యుత్‌ వినియోగించే పేద కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం సిబ్బందికి డబ్బులు చెల్లిస్తే చాలు నేరుగా రశీదులు ఇచ్చే ఏర్పాట్లు చేసింది. విద్యుత్‌ మీటర్లు లేని వినియోగదారు లు ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసు కోవాలని అధికా రులు కోరుతున్నారు.

నిరుపేద కుటుంబాలకు అవకాశం...

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు విద్యుత్‌ సంస్థ ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. అయితే 250 నుంచి 500 వాట్ల విద్యు త్‌ను వినియోగించుకునే వారికి ఈ అవకాశం కల్పిస్తు న్నారు. విద్యుత్‌ లోడ్‌ ఆధారంగా దరఖాస్తు ఫీజులు, చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 500 వాట్స్‌ వరకు విద్యుత్‌ వినియో గించుకునేవారు దరఖాస్తు ఫీజు రూ.25లతో పాటు (అదనంగా 18 శాతం జీఎస్‌టీ (రూ.4.50లు)), డెవలప్‌మెంట్‌ చార్జీ రూ.600లతో పాటు (అదనంగా 18శాతం జీఎస్‌టీ (రూ108లు)), సెక్యురిటీ డిపాజిట్‌ రూ.200లు చొప్పున మొత్తం రూ.937-50లు చెల్లించాల్సి ఉంటుంది. 250 వాట్ల విద్యుత్‌ వాడకందారులు అప్లికేషన్‌ రుసుము రూ.25లతో పాటు (అద నంగా 18 శాతం జీఎస్‌టీ రూ.4.50లు), డెవలప్‌మెంట్‌ చార్జీ రూ.600ల తో పాటు (అదనంగా 18శాతం జీఎస్‌టీ (రూ108లు)), సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.80లు కలిపి మొత్తం రూ.817-50లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

గృహజ్యోతి ఫలాలు అందించేందుకు..

పల్లెలు, గ్రామాలు, కాలనీలు, తండాల్లో చాలా మంది పేదలు విద్యుత్‌ మీటర్లు లేకుండానే కరెంటును వినియోగించుకుంటున్నారు. వీరు అధికా రికంగా విద్యుత్‌ కనెక్షన్‌, మీటరుకు డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవ డంతో ప్రభుత్వం 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను ఉచితంగా అందించే గృహజ్యోతి పథకానికి దూరమయ్యారు. ఇలాంటి పేద కుటుంబాలకు తక్కువ ధరకే విద్యుత్‌ కనెక్షన్‌, మీటర్లు అందించేందుకు చర్యలు చేపట్టా రు. అలాగే ఈనెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ మీటర్లు లేని పేద కుటుంబాల వారు గృహావసరాల కోసం దరఖాస్తు చేసుకుంటే అధికా రులు ఈ నెల 15వరకు విద్యుత్‌ మీటర్లను అందజేయనున్నారు. తద్వారా వారు ప్రజా పాలనలో జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా గృహజ్యోతి పథకం పొందే అవకాశం ఉంది. అదే నెల నుంచి వారికి సున్నా బిల్లు రానుంది.

15 వరకు దరఖాస్తుకు అవకాశం..

విద్యుత్‌ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ మీటర్లు లేని గృహాలను గుర్తిస్తారు. గృహాలకు విద్యుత్‌ మీటర్లు లేని నిరుపేద కుటుంబాల వారు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. విద్యుత్‌ కేంద్రాలు, స్థానిక ఉప కేంద్రాల్లో గాని విద్యుత్‌ సిబ్బందికి దరఖాస్తు ఫారాలు అందించి విద్యుత్‌ వాట్స్‌ వినియోగం ప్రకారం డబ్బులు చెల్లిస్తే రశీదు ఇస్తారు. రెండు రోజుల్లోగా వినియోగదా రుడి ఇంట్లో విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి మీటరు బిగించేలా ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ పథకం అమలులో దళారుల ప్రమేయం లేకుండా, చేతి వాటం చూపించకుండా చూడాల్సిన బాధ్యతతో పాటు అనర్హులకు మీటర్లు జారీ చేయకుండా నివారిం చాల్సిన అవసరం ఉంది.

వినియోగించుకోవాలి : టి.వేణుమాధవ్‌,

ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌ఈ, జనగామ

విద్యుత్‌ సంస్థ తక్కువ ధరకే గృహాలకు విద్యుత్‌ కనెక్షన్‌, మీటరు అందించే సౌకర్యాన్ని పేదలు సద్విని యోగం చేసుకోవాలి. అర్హులైన వారి నుంచి దరఖా స్తులను స్వీకరిస్తున్నాం. ఆయా గ్రామాల్లో విద్యుత్‌ సిబ్బంది విద్యుత్‌ మీటర్లు లేని కుటుంబాలను గుర్తించేందుకు సర్వే చేపడుతున్నారు.. 250 వాట్స్‌ వినియోగించే కుటుంబాల గృహాలకు జీఎస్‌టీతో కలిపి మొత్తం రూ..817-50లు, 500 వాట్స్‌ విద్యుత్‌ వినియోగించుకునే వారు జీఎస్‌టీతో కలిపి మొత్తం రూ.937-50లు చెల్లించాలి. దరఖాస్తుదా రులు దళారులను ఆశ్రయించవద్దు. విద్యుత్‌ సిబ్బంది వద్ద రశీదు తీసుకో వాలి. రెండు రోజుల్లోగా మీటరును బిగించేలా ఏర్పాట్లు చేశాం. దారిద్య్రరే ఖకు దిగువన ఉన్న పేదలకు అతి తక్కువ ధరకు విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు ఎన్‌పీడీసీఎల్‌ సంస్థ ఈ సదవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే మీటర్లు ఏర్పాటు తరువాత ఈనెల 17 నుంచి ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలనలో సున్నా బిల్లు కోసం వారు దరఖాస్తు చేసుకుంటే.. అదే నెల నుంచి గృహజ్యోతి (జీరో బిల్లు) పథకం సైతం వర్తిస్తుంది.

Updated Date - Sep 06 , 2024 | 12:09 AM