Share News

గొత్తికోయగూడేలపై.. సీజనల్‌ పంజా

ABN , Publish Date - Jun 14 , 2024 | 11:50 PM

వానాకాలం ప్రారంభానికి ముందే సీజనల్‌ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ములుగు ఏజెన్సీ ప్రజలను ముఖ్యంగా గొత్తికోయగూ డేలను ప్రతీయేడు భయపెట్టే మలేరియా, డెంగీ ఈసారి పడగ విప్పుతున్నాయి. ప్రస్తుతం గొత్తికోయ గూడేల్లో పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతోపాటు రోగికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

గొత్తికోయగూడేలపై.. సీజనల్‌ పంజా
వాజేడు మండలంలోని పెనుగోలు ఆదివాసీ గూడెం

చాపకింద నీరులా వ్యాపిస్తున్న మలేరియా, డెంగీ

తాడ్వాయి, కన్నాయిగూడెం, గోవిందరావుపేట మండలాల్లో 17 కేసులు

అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ

మలేరియా, డెంగీ నివారణ నెలలుగా జూన్‌, జూలై

ఆశా కార్యకర్తల వద్ద టెస్టింగ్‌ కిట్లు

ములుగు, జూన్‌ 14: వానాకాలం ప్రారంభానికి ముందే సీజనల్‌ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ములుగు ఏజెన్సీ ప్రజలను ముఖ్యంగా గొత్తికోయగూ డేలను ప్రతీయేడు భయపెట్టే మలేరియా, డెంగీ ఈసారి పడగ విప్పుతున్నాయి. ప్రస్తుతం గొత్తికోయ గూడేల్లో పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడంతోపాటు రోగికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న ములుగు ఏజెన్సీలో మలేరి యా, డెంగీతోపాటు డయేరియా వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలడం పరిపాటే. అయితే మండు వేసవిలో 13 మలేరియా, నాలుగు డెంగీ కేసులు మొత్తం 17 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గోవిందరావుపేట పీహెచ్‌సీ పరిధిలో నలుగురికి, తాడ్వాయి పరిధిలో ఆరుగురికి, కాటాపూర్‌, కొడిశాల, కన్నాయిగూడెం పీహెచ్‌సీల పరిధిలో ఒక్కొక్కరికి మలేరియా నిర్ధారణైంది. అదేవి ధంగా వెంకటాపూర్‌(రామప్ప) పీహెచ్‌సీ పరిధిలో ఒకరికి, రాయినిగూడెం పరిధిలో ఇద్దరికి, పస్రా పరిధి లో ఒకరికి డెంగీ సోకింది. వ్యాధిగ్రస్తులంతా గొత్తికో య గూడేలకు చెందిన వారు కావడం గమనార్హం. దోమలు, కలుషిత తాగునీటితో వ్యాధి సోకినట్లు నిర్ధారణైంది. చికిత్స అనంతరం వారంతా కోలుకు న్నారు. గతేడాది 79 మలేరియా, 30 డెంగీ కేసులు వెలుగు చూశాయి.

123 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు

ఎక్కువగా మలేరియా, డెంగీ వ్యాధి ప్రబలే జిల్లా లోని 23 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇక్కడ వ్యాధి నివారణ, ప్రా థమిక స్థాయిలో గుర్తింపు, మెరుగైన వైద్యం అందిం చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్ర స్తుతం గ్రామానికో ఆశా కార్యకర్త ఉండగా వారి వద్ద 30కి తగ్గకుండా మలేరియా టెస్టింగ్‌ కిట్లను అందుబా టులో ఉంచనున్నారు. జ్వరం సోకిన వ్యక్తికి మలేరి యా, డెంగీ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు జరిపి అ వసరమైన మందులను అందజేయనున్నారు. ఇదే క్ర మంలో జూలైలో ఇంటింటికీ దోమల నివారణ మందు ను పిచికారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మారుమూల అటవీ పల్లెలపై నజర్‌

జిల్లాలో 60కిపైగా గొత్తికోయగూడేలు, మారుమూ ల అటవీ గ్రామాలున్నాయి. వీటిలో 20 గ్రామాలకు కనీసం రోడ్డు సదుపాయం లేదు. వర్షాకాలంలో వరద ల కారణంగా నడకదారీ మూసుకుపోతుంది. వీటిలో ఐలాపూర్‌, పోచాపూర్‌, అల్లిగూడెం, నర్సాపూర్‌, లవ్వా ల, బొల్లెపల్లి, ఎడ్జర్లపల్లి, పెనుగోలు, రాపట్ల తదితర గ్రామాలు బాహ్యప్రపంచానికి చిట్టచివరన ఉంటాయి. దదీంతో ఈ గ్రామాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులను సరిపడా అందుబాటులో ఉంచనున్నారు. గర్భిణులను గుర్తించి ప్రసవానికి నెల రోజుల సమయమున్న వారిని ముందే ఏటూరునాగారం, ములుగు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించి అడ్మిట్‌ చేయాలని నిర్ణయించారు.

24 గంటల వైద్యసేవలు

జిల్లాలో మొత్తం 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ండగా వీటిలో ఎదిర, గోవిందరావుపేట, కన్నాయి గూడెం, మంగపేట, పేరూరు, తాడ్వాయి, వెంకటా పూర్‌, వాజేడు పీహెచ్‌సీలను 24 గంటల ఆస్పత్రు లుగా గుర్తించారు. వర్షాకాల సీజన్‌లో అన్ని పీహెచ్‌ సీల్లో నిరంతర వైద్యసేవలు అందించాలని అధికా రులు నిర్ణయించారు. ములుగు ఏరియా వైద్య శాలతోపాటు ఏటూరునాగారం, వెంకటాపురం వెద్యశాలల్లో అన్ని బెడ్లను సిద్ధం చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉన్నాం..

- డాక్టర్‌ అల్లెం అప్పయ్య, ములుగు డీఎంహెచ్‌వో

సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం. కేవలం ఎది ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మాత్రమే రెండో వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. ముగ్గురు పీజీ విద్యనభ్యసించేందుకోసం ప్రత్యేక అనుమతితో వెళ్లారు. మొత్తం 28 మంది వైద్యులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. మలేరియా, డెంగీ, సీబీపీ కిట్లను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఏఎన్‌ఎంలు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యాయి. మూడు నెలలకు సరిపడా మందుల కోసం ప్రభుత్వానికి ఇండెంట్‌ పెట్టాం. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ జ్వరం సోకిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. వర్షాకాలంలో కలుషిత తాగునీటితో ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున కాచి చల్లార్చిన నీటిని తాగాలి. దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి.

Updated Date - Jun 14 , 2024 | 11:51 PM