Share News

రైతన్నలు ప్ర‘సన్న’ం

ABN , Publish Date - Jul 27 , 2024 | 11:15 PM

రైతన్నల ఆలోచనల్లో మార్పు వస్తోంది. వ్యవసాయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కు తోంది. సాగులో అన్నదాతలు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగా దొడ్డు రకం వరికి స్వస్తి పలికారు.. సన్నరకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

రైతన్నలు ప్ర‘సన్న’ం
ఏపుగా ఎదిగిన సన్నరకం వరి నారు

ఆధునిక బాటలో అన్నదాతలు

సన్న రకాల వరి సాగుపై ఆసక్తి

సర్కారు ప్రోత్సహించడంతో మందుకు..

భూపాలపల్లి జిల్లాలో పెరిగిన విస్తీర్ణం

దొడ్డు రకాలపై విముఖత

కాటారం, జూలై 27: రైతన్నల ఆలోచనల్లో మార్పు వస్తోంది. వ్యవసాయం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కు తోంది. సాగులో అన్నదాతలు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగా దొడ్డు రకం వరికి స్వస్తి పలికారు.. సన్నరకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 92 లక్షల ఎకరాల్లో ఈ రకాల వరిని సాగు చేస్తున్నారు.

ప్రస్తుత వానాకాలంలో జిల్లాలో సుమారు 1.12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు కానుంది. ఇందులో అత్య ధికంగా సన్న రకాలే ఉన్నాయి. గతానికి భిన్నంగా రైతు లు వరి సాగులో దొడ్డు రకాలపై విముఖత చూపుతున్నారు. వ్యయప్రయాసకోర్చయినా సన్న రకాల కే మొగ్గు చూపుతున్నారు. కొత్తగా కొలువు దీరిన సర్కా రు ఇస్తున్న ప్రోత్సాహకమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రైతు భరోసాలో భాగంగా సన్న రకం వడ్ల కు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇవ్వనున్నట్లు రేవంత్‌రె డ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఈ సీజన్‌ వరి ధాన్యం కొనుగోళ్ల నుంచే బోనస్‌ వర్తించనుండటం సన్నరకాల సాగు విస్తీర్ణం పెరగడానికి ప్రధాన కారణమని తెలు స్తోంది. రెండు, మూడేళ్లుగా దొడ్డు రకాలైన ఎంటీయూ- 1001, 1075, 1061, 1153, కేఎన్‌ఎం-118 వంటి వడ్లను కొనుగోలు చేయడంలో మిల్లర్లు విముఖత ప్రదర్శించ డం మరో కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ ప్రోత్సహించడం వల్లే..

జిల్లాలో 40 వెరైటీలకు పైగా సన్నరకాలు సాగవుతు న్నాయి. ప్రధానంగా ఎంటీయూ-1224, 1271, 1282, జేజీఎల్‌-1798, హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎం-1638, బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్‌-15048 (తెలంగాణ సోనా)లతో పాటు ప్రైవేట్‌ విత్తన కంపెనీలకు చెందిన జైశ్రీరాం, కావేరి చింటూ, జీనెక్స్‌ చిట్టిపొట్టి, ధనిష్ట, సూప ర్‌ ఆమన్‌, సౌభాగ్య, అన్నపూర్ణ, బయోసీడ్‌-504, పల్లవి, అంకుర్‌, ఆమని, అమోఘ్‌ తదితర రకాలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో ఎంటీయూ-1224, 1271, 1282, ఆర్‌ఎన్‌ఆర్‌-15048 రకాలకు డిమాండ్‌ పెరిగి 33వేల ఎకరాల్లో సాగు అవుతుండటం విశేషం. ప్రభు త్వం సన్న రకం వడ్లకే మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్‌ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు సన్న రకాల సాగుకే మొగ్గుచూపుతుండగా భూపాలపల్లి జిల్లాలోనూ దీనికి ప్రాధాన్యం పెరిగింది. ఇదే క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన సన్న రకాల జాబితాలో ఉన్న వెరైటీలతోపాటు పలు ప్రైవేట్‌ కంపెనీల రకాలను కూ డా సాగుచేస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, పాఠశాల లు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ సన్నబియ్యం వండిపెడు తున్న నేపథ్యంలో ఈ సీజన్‌లో ఇబ్బడిముబ్బడిగా సన్న రకాల వరి సాగు పెరిగింది. తద్వారా రాష్ట్రంలో సన్నబి య్యం కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మార్కెట్లో భలే డిమాండ్‌

ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో సన్న బియ్యానికి భారీగా డిమాండ్‌ ఉంది. వడ్లకు రూ.2,500 నుంచి 3,200 వరకు ధర పలకగా సన్న రకం పాత బియ్యానికి క్వింటాల్‌కు రూ.5500-8000 వరకు ధర ఎగబాకింది. కొన్ని దొడ్డు రకాల వడ్లు మార్కెటింగ్‌లో ఇబ్బందులు తలెత్తడంతో సన్న రకాలపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మేయొచ్చని అన్నదాతలు ఆలోచిస్తున్నారు. వడ్లను మిల్లుల్లో పట్టించి బియ్యం సైతం విక్రయించొ చ్చని అభిప్రాయంతో ఉన్నా రు. ప్రస్తుతం ఈ సీజన్‌లో బోర్లు, బావుల కింద వరి నాట్లు మొదలు కాగా చెరు వులు, కుంటల కింద రైతులు నార్లు పోశారు. పలువురు నాట్లు వేయించడం కాకుండా వెదజల్లే పద్ధతి(బ్రాడ్‌కాస్టింగ్‌ మెథడ్‌)లో వరిని సాగు చేస్తున్నారు. కొద్దిగా మొలకెత్తిన వడ్లను పొలంలో చల్లే ప్రక్రియ కొనసాగుతోంది.

ఖర్చులు ఎక్కువైనా..

యాసంగిలో సన్నరకాల సాగు మరీ తక్కువగా ఉంటుండగా వానాకాలంలో సాధారణంగా సాగు విస్తీర్ణంలో 40-50 శాతం సన్న రకాల వడ్లు సాగవుతాయి. దొడ్డు వడ్ల వెరైటీలతో పోలిస్తే సన్న రకం వరి సాగుకు పెట్టుబడి అధికమవుతుంది. సన్న రకాలకు తెగుళ్లు, చీడపీడల బాధ ఎక్కువగా ఉంటుండగా నివారణ, నియంత్రణ కోసం పురుగుమందులు స్ర్పే చేయాల్సి ఉంటుంది. దొడ్డురకం వరి దిగుబడితో పోలిస్తే సన్న రకాలు తక్కువ దిగుబడినిస్తాయి. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యయప్రయాసలకోర్చి రైతులు సన్నాల సాగు వైపు అడుగేశారు.

Updated Date - Jul 27 , 2024 | 11:15 PM