Share News

పడకేసిన ‘ప్రత్యేక’ పాలన

ABN , Publish Date - Jul 04 , 2024 | 12:00 AM

పల్లెల్లో ప్రత్యేకాధి కారుల పాలన పడకేసింది. ఒక్కో అధికారికి మూడు, నాలు గు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్థంగా మారిపోయింది. మిషన్‌ భగీరథ పైపులైన్ల లీకేజీలు, చేతిపంపులు మరమ్మతులకు నోచుకోకపోవడం, పారిశుధ్యంపై పర్యవేక్షణ కొరవడడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు.

పడకేసిన ‘ప్రత్యేక’ పాలన

గ్రామ పంచాయతీలను పట్టించుకోని ప్రత్యేకాధికారులు

వారానికోసారి కూడా గ్రామాలకు రాని వైనం

నిధుల కొరతతో పంచాయతీలు విలవిల

పంచాయతీ కార్యదర్శులపైనే పని భారం

గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు

క్షీణిస్తున్న పారిశుధ్య నిర్వహణతో అనారోగ్యాల బారిన ప్రజలు

హనుమకొండ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో ప్రత్యేకాధి కారుల పాలన పడకేసింది. ఒక్కో అధికారికి మూడు, నాలు గు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్థంగా మారిపోయింది. మిషన్‌ భగీరథ పైపులైన్ల లీకేజీలు, చేతిపంపులు మరమ్మతులకు నోచుకోకపోవడం, పారిశుధ్యంపై పర్యవేక్షణ కొరవడడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు.

ఐదు నెలలుగా..

ఈ ఏడాది జనవరి నెలాఖరునాటికి సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో పంచాయతీల పాలనావ్యవహారా లను చూసేందుకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమిం చింది. ప్రత్యేకాధికారుల పాలన మొదలై అయిదు నెలలవు తోంది. నిధులు లేమికి తోడు తమకున్న శాఖారపరమైన విఽఽధులే కాకుండా గ్రామాల ప్రత్యేక అధికారుల అదనపు బాధ్యతలు అప్పగించడంతో సదరు అధికారులు పల్లెలను పెద్దగా పట్టించుకోవడం లేదు. నామమాత్రంగానే పల్లెల ముఖం చూడడం లేదు. దీంతో పంచాయతీల్లో పర్యవేక్షణ కొ రవడింది. ఫలితంగా స్థానికంగా పంచాయతీ కార్యదర్శు లపైనే మొత్తం భారం పడుతున్నది. అభివృద్ధి పనులు పడకే శాయి. మరమ్మతులు అటకెక్కాయి. ప్రత్యేకాధికారుల పాలన కు ముందు పంచాయతీ ఖాతాల్లోని నిధులను సర్పంచులు వాడేసుకున్నారు. ఇప్పుడు పంచాయతీల ఖాతాల్లో ఒక్క పైసా కూడా లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి కొన్ని నెలలుగా నిధులు జమకావడం లేదు. దీంతో పంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతోం ది. పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. గతంలో చేపట్టిన పలు పనులకే నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడటంతో కొత్త పనులు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత వర్షాకాలంలో గ్రామాల్లో పారి శుధ్యం మెరుగుపడకపోతే ప్రజలు జబ్బుల బారిన పడే అ వకాశం ఉంది. ఇప్పటికే గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలు తున్నాయి. డెంగీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. పారిశుధ్య చర్యలు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రామీణులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.

మాతృశాఖకే పరిమితం

గత ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభ మైంది. మండల, డివిజన్‌ స్థాయిలోని గెజిటెడ్‌ ఉద్యోగులకు మూడు కంటే ఎక్కువ పంచాయతీ బాధ్యతలు అప్పగించా రు. వారికి ఇప్పటికే పనిభారం అధికంగా ఉండడంతో పంచా యతీల బాధ్యతలను చూడడంలో ఉదాసీనత ప్రదర్శిస్తున్నా రు. ప్రధానంగా మిషన్‌ భగీరథ, నీటిపారుదల శాఖల అధి కారులు అయితే తమ మాతృశాఖకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి. సొంత శాఖ విధులతో పాటు ఉన్నతాధి కారులు సమీక్షలు, సమావేశాలకు హాజరుకావడం వంటి బాధ్యతలు కూడా ఉంటాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ విధుల భారం కూడా వారిపైనే పడింది. సెక్టోరియల్‌ సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల బాద్యలను సైతం వారే మోశారు. ప్రత్యేకాధికారులు వారంలో కనీసం రెండు పర్యాయాలైన గ్రామాలు వెళ్లడం లేదు. ఫలితంగా స్థానిక పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలపై అదనపు భారం పడుతున్నది.

సమస్యల చిట్టా

పంచాయతీలను ప్రత్యేకాధికారులు పట్టించుకోక పోవడంతో అనేక గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు చాలా చోట్ల లీకై నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు, పాడైన బోర్లను బాగు చేయించేవారు కరవయ్యారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. నర్సరీల సంరక్షణ సరిగా జరగడం లేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు దాదాపు 14 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు రెండు నెలలకోసారి మంజూరవు తున్నా సరిపోక పంచాయతీలకు ఇక్కట్టు తప్పడం లేదు. పాలరవర్గం ఉన్న సమయంలో అప్పోసప్పో చేసి గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పూనుకునే వారు. బిల్లులు మంజూరైనప్పుడు తీసుకునేవారు. ఇప్పుడు పంచాయతీల్లో నిధుల లేమితో ప్రత్యేకా ధికారులు పట్టించుకోవడం లేదు. దీనికితోడు ప్రత్యేక అధికారుల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరిపో యింది. గ్రామాలకు మంజూరైన పనుల్లో రాజకీయ పార్టీల నాయకుల జోక్యం పెరిగింది. ఆయా పనుల కు సంబంధించి ఒత్తిళ్లు తప్పపోవడంతో అధికా రులు మిన్నకుండిపోతున్నారు.

నిధులకు కటకట

గ్రామ పంచాయతీలు నిధుల కటకటను తీవ్రం గా ఎదుర్కొంటున్నాయి. ఖాతాల్లో డబ్బులు లేక, అ త్యవసర పనులకు ఖర్చు చేయలేక సతమతమవు తున్నాయి. పారిశుధ్య కార్మికుల జీతాలు, పైపుల లీ కేజీ మరమ్మతు, బోర్ల మరమ్మతు పనులు, పంచా యతీ ట్రాక్టర్‌ నెలవారీ బ్యాంకు వాయిదా, గ్రామా ల్లో విద్యుత్‌ దీపాలు, నెలనెలా విద్యుత్‌ బకాయిలు.. ఇవన్నీ కచ్చితంగా చెల్లించాల్సిందే. నిధుల లేకపో వడంతో ఈ బరువు బాధ్యతల గురించి ప్రత్యేకాధికా రులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గామ కార్యదర్శులే ఎలాగోలా కార్మికులకు జీతాలు సర్దుబా టు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో గ్రామపంచాయతీ రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు అప్పు చేసి చెల్లి స్తున్నారు. పంచాయతీల ప్రత్యేకాధికారులు ఖర్చు విషయంలో లెత్తేస్తుండడంతో భారమంతా కార్యద ర్శులపైనే పడుతోంది. నాలుగు రోజులు ఉండిపోయే వాళ్లమని ప్రత్యేకాధిరులు దాటవేత ధోరణిని అను సరిస్తున్నారు.

మూడు విధాలుగా నిధులు

పంచాయతీలకు మూడు రకాలుగా నిధులు స మకూరుతాయి. అస్తిపన్ను, ఎస్‌ఎఫ్‌సీ ఖాతా, 15వ ఆర్ధిక సంఘం ద్వారా ఈ నిధులు వీటిలో ఉన్నాయి. అవి కూడా సకాలంలో చాలినన్ని సమకూరడం లేదు. పంచాయతీలకు వివిధ రకాల పన్నుల ద్వారా రాబడి వస్తుంది. చాలా గ్రామ పంచాయతీలకు ఇది కూడా చాలినంత రావడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతీ అయిదు వందల జనాభాకు ఒక గ్రామ పంచాయతీని చేయడంతో ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆస్తి పన్ను జమ చేసుకునే ఖాతా, పన్నుల రాబడికి మించి ఖర్చులుండడంతో ఈ ఖాతా ఎప్పుడు ఖాళీగానే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు పద్నాలుగు నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆస్తిపన్ను, ఎస్‌ఎఫ్‌సీ ఖాతాల్లో జమయ్యే మొత్తం ట్రెజరీ ద్వారా డ్రాచేయాల్సి ఉంటుంది. కానీ గత సర్కారు హయాంలో ఎస్‌ఎఫ్‌సీ నిధులు అరకొరగా విడుదల చేసింది. ఇక 15వ ఆర్థిక సంఘం నిధుల విషయానికి వస్తే.. ఇందులో కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు గ్రామ జనాభా ప్రాతిపదికన జమ చేస్తుంది. ప్రతీ నాలుగు నెలలకోసారి వీటిని అందజేస్తుంది. కేవలం ఈ నిధులు మాత్రమే పంచాయతీలకు అందుతుండడంతో వీటిని ప్రత్యేక పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు ఖర్చు చేయని నిధులు.. ఆయా ఖాతాల్లో మిగిలిపోగా మార్చిలో వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది.

1,688 గ్రామ పంచాయతీలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 1,688 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2018లో ఉమ్మడి జిల్లాలో 1,060 పంచాయతీలు మాత్రమే ఉండేవి. కేసీఆర్‌ ప్రభుత్వం 500 జనాభాకన్నా మించి ఉన్న తండాలను కూడా పంచాయతీలుగా మార్చడంతో వాటి సంఖ్య 1,688కి పెరిగింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో 208, వరంగల్‌ జిల్లాలో 323, జనగామ జిల్లాలో 281, మహబూబాబాద్‌ జిల్లాలో 461, ములుగు జిల్లాలో 174, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 241 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ మొత్తం 1,688 పంచాయతీల్లో 83 మేజర్‌ గ్రామ పంచాయతీలు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పనర్విభజన ఫలితంగా వాటి పరిధిలో అంతకుముందున్న గ్రామ పంచాయతీల సంఖ్యలో మార్పులు జరిగాయి. హనుమకొండ జిల్లాలో పెరగ్గా వరంగల్‌ జిల్లాలో తగ్గాయి.

Updated Date - Jul 04 , 2024 | 12:00 AM