Share News

‘గుండ్లవాగు’కు నిర్లక్ష్యపు గండం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:01 AM

ప్రతిష్టాత్మక జల యజ్ఞం పథకానికి నిలువెత్తు సాక్ష్యం గుండ్లవాగు ప్రా జెక్టు. ఈ చిన్నతరహా నీటిపారుదల వ్యవస్థ అప్ప ట్లో ఒక సంచలనం. కానీ, పాలకుల నిర్లక్ష్యానికి గురై ప్రా జెక్టు ‘లక్ష్యం’ నెరవేరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా కాల్వ లను తవ్వించక, మరమ్మతులు చేయిం చకపోవడంతో ప్రాజెక్టు మనుగడ ప్రమాదంలో పడింది. గత పాలన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న కొత్త సర్కారు గుండ్లవాగుపై దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.

‘గుండ్లవాగు’కు నిర్లక్ష్యపు గండం
గుండ్లవాగు ప్రాజెక్టు (ఫైల్‌)

సాగు లక్ష్యానికి దూరంగా ప్రాజెక్టు

చివరి పొలాలకు అందని సాగునీరు

కాలువల విస్తరణలో పట్టించుకోని పాలకులు

స్పిల్‌వే, తూములలో లీకేజీలు

డ్యామ్‌ సేఫ్టీ జాబితాలోకి చేర్చి మరమ్మతు చేస్తేనే ఉపయోగం

గోవిందరావుపేట, ఏప్రిల్‌ 12 : ప్రతిష్టాత్మక జల యజ్ఞం పథకానికి నిలువెత్తు సాక్ష్యం గుండ్లవాగు ప్రా జెక్టు. ఈ చిన్నతరహా నీటిపారుదల వ్యవస్థ అప్ప ట్లో ఒక సంచలనం. కానీ, పాలకుల నిర్లక్ష్యానికి గురై ప్రా జెక్టు ‘లక్ష్యం’ నెరవేరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా కాల్వ లను తవ్వించక, మరమ్మతులు చేయిం చకపోవడంతో ప్రాజెక్టు మనుగడ ప్రమాదంలో పడింది. గత పాలన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న కొత్త సర్కారు గుండ్లవాగుపై దృష్టిసారించాలని రైతులు కోరుతున్నారు.

20 ఏళ్ల క్రితం పునాదిరాయి

వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ములుగు పర్యటనకు వచ్చిన సందర్భంగా గుండ్లవాగు ప్రాజెక్టు నిర్మాణానికి తొలి అడుగు పడిం ది. గోవిందరావుపేట మండలం కర్లపల్లి సమీపంలో 2004లో రూ.10 కోట్ల వ్యయంతో పనులు మొద లుపెట్టారు. 2006 ఆగస్టు 4న భారీ వరదలు ముం చెత్తడంతో కట్ట తెగిపోయింది. ఆతర్వాత రూ.6 కోట్లను అదనంగా విడుదల చేసి పనులు పూర్తిచేశారు. కుడి, ఎడమ కాల్వల నిర్మాణం, భూసేకరణ ఖర్చులు కలిపి సుమారు రూ.35 కోట్ల వరకు ఖర్చయ్యాయి. 4,500 ఎకరాలకు రెండు పంటలకు సరిపడా నీటిని అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

బలహీనపడ్డ కట్ట.. తూముల్లో లీకేజీలు

ఓసారి కొట్టుకుపోయిన కట్టను డిజైన్‌ మార్పు చేసి పునర్నిర్మించినప్పటికీ గడిచిన 15 ఏళ్ల కాలంలో కట్ట బలహీన పడింది. ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు, వరదలకు కోతకు గురైంది. సమయంలో రెండు తూములలో లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతోంది. ఈసారి యాసంగిలో ఆయకట్టు చివరి పొలాలకు నీరందకపోవడంతో 200 ఎకరాలలో వరిపంట ఎండిపోయింది. ప్రతీసారి తాత్కాలిక మరమ్మతులతో నెట్టుకు వస్తుండగా భవిష్యత్‌లో ప్రమాదం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. డ్యామ్‌ సేఫ్టీ జాబితాలో గుండ్ల వాగు ప్రాజెక్టును చేర్చి పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తేనే భవిష్యత్‌ ఉంటుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది.

అసంపూర్తిగా కాల్వల నిర్మాణం

గుండ్లవాగు ప్రాజెక్టు పను లు పూర్తయినప్పటికీ కాలువ ల పనులు పూర్తికాక పోవడం తో పొలాలకు పూర్తి స్థాయిలో నీరందడం లేదు. అధికారుల అంచనా ప్రకారం పూర్తి సాగు 3,500 ఎకరాల వరకు ఉంది. అయితే రాంనగర్‌ శివారు వరకు కాలువ పను లు జరగగా అటు తర్వాత వర్షాకాలం నీరందితేనే పంటలు పండే సుమారు 500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు మరో రెండు కిలోమీటర్ల మేర కాలువను పొడిగించాల్సి ఉంది. ఈ పనులు జరిగితే దుంపెల్లిగూడెం, రాంనగర్‌, ఎల్బీనగర్‌ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. వర్షాకాలం సరైన వర్షాలు పడిన సమయంలోనే పంటలు సంపూర్ణంగా చేతికి వస్తున్నాయి. లేకపోతే ఎండిపోయే పరిస్థితులు ఉంటా యని రైతులు తెలిపారు. కాలువ పొడిగింపు పనులు జరిగితే కనీసం ఒక పంట ఖచ్చితంగా చేతికి అందు తుందని రైతులు పేర్కొంటున్నారు.

పెండింగ్‌లో పరిహారం..

పంట కాల్వల తవ్వకం కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు నేటికీ ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. ఓ పక్క భూములు కోల్పోయిన రైతులు సాయం కోసం ఎదురుచూస్తూనే చివరి పొలాలకు నీరందక ఏటా నష్టాల పాలవుతున్నారు. 2009లో సర్వేచేసి 2012లో కాల్వల తవ్వకం పూర్తిచేశారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన పరిహా రం సరిపోదని రైతులు వాదించడంతో పంపిణీని నిలిపివేసిన ప్రభుత్వం అప్పటి నుంచి హోల్డ్‌లో పెట్టిం ది. భూసేకరణ చేపట్టి పదేళ్లు పూర్తయినా పరిహారం అందక రైతులు వేదన చెందుతున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం రూ.2.66 కోట్ల నిధు లను విడుదల చేయగా పంపిణీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే దెబ్బతిన్న స్పిల్‌వే(మత్తడి) ఎత్తు మరో 5 మీటర్ల పెంచడంతో పాటు తూముల మరమ్మతు, కాల్వల విస్తరణ, పూటికతీత పనులు చేపట్టాల్సి ఉంది. ఈమేరకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మంత్రి సీతక్కను కలిసిన రైతులు

గుండ్లవాగు ప్రాజెక్టు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల రైతులు రాష్ట్ర మంత్రి సీతక్కను కలిశారు. భూసేకరణ పరిహారం, కాల్వల విస్తరణ, ప్రాజెక్టు మరమ్మతుకు సత్వర చర్యలు తీసుకోవాని కోరారు. ఎమ్మెల్యేగా గతంలో రైతుల పక్షాన పోరాటం చేసిన సీతక్క సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు. కాగా, దశాబ్ధ కాలంగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని, మంత్రి హామీతో నిరీక్షణ ఫలిస్తుందనే నమ్మకం కలిగిందని గుండ్లవాగు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు బాషా తెలిపారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే చేసి పునరుద్ధరణ చర్యలు చేపడితే మొత్తం 4,500 ఎకరాలకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందుతుందని ఆయన అన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:01 AM