Share News

Healthcare: అంగన్‌వాడీలు వేదికగా పోషణమాసానికి శ్రీకారం

ABN , Publish Date - Sep 18 , 2024 | 11:46 PM

చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యసంరక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతు న్నాయి. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. కానీ సరైన అవగాహన లేకపోవడం, పేదరికం కారణంగా చాలా మంది పోషకాహార లోపంతో పలు రుగ్మతల బారిన పడుతున్నారు.

Healthcare: అంగన్‌వాడీలు వేదికగా పోషణమాసానికి శ్రీకారం
Anganwadi Centre

అంగన్‌వాడీలు వేదికగా పోషణమాసానికి శ్రీకారం

ఈనెల 30వరకు 695కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

పోషకాహారం ప్రాధాన్యతపై మహిళలకు అవగాహన

జఫర్‌గడ్‌, సెప్టెంబరు 14 : చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యసంరక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతు న్నాయి. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. కానీ సరైన అవగాహన లేకపోవడం, పేదరికం కారణంగా చాలా మంది పోషకాహార లోపంతో పలు రుగ్మతల బారిన పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతీ ఏటా సెప్టెంబరు మాసంలో సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ (ఐసీడీఎస్‌) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాల ను చేపడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరత, ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1 నుంచి 30 వరకు వివిధ శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వా ములను చేస్తూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషణ మాసం (పోషణ అభియాన్‌) పేరుతో ప్రత్యేక అవగా హన, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లాలో ని స్టేషన్‌ఘన్‌పూర్‌, కొడకండ్ల, జనగామ మూడు ప్రాజెక్టుల పరిధిలోని 12 మండలాల పరిఽధిలో మొత్తం 695 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ఈ కేంద్రాల్లో 03 - 6 ఏళ్ల లోపు ప్రీ స్కూల్‌ పిల్లలు 9,559 మంది, 07 -03 ఏళ్ల లోపు చిన్నారులు 13,991 మంది ఉన్నారు. అలాగే 2,554 మంది బాలింతలు, 2,712 మంది గర్భిణులున్నారు.


పిల్లల ఎదుగుదలపై పర్యవేక్షణ... మాతా, శిశు సంరక్షణ..

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు. వారు సరైన రీతిలో ఎదిగేందుకు ఎప్పటికపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలబాలికల ఎదుగుదలను పర్యవేక్షి స్తున్నాయి. వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు వివిధ సందర్భాల్లో పోషకాహార లోపాన్ని అధిగమిం చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అంగన్‌వాడీల ద్వారా గ్రోత్‌ మేళా నిర్వహించారు. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలను గుర్తించి.. వారి ఎదుగుదలకు పౌష్టికాహారా న్ని అందించాల్సిన తీరును వారి తల్లులకు వివరిస్తున్నారు. మాతా, శిశు సంపూర్ణ ఆరోగ్య సంరక్ష ణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. పిల్లల సంరక్షణతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం దిశగా కార్యక్రమాలను చేపడుతున్నారు. చిన్నారుల్లో శారీరక ఎదుగుదలలో లోపాలను నివారిం చేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారంతో పాటు వివిధ రకాల సేవలందిస్తోంది. గర్భిణులు, బాలింతల్లో పోషణస్థాయిని మెరగుపరచడమే కాకుం డా తల్లితో పాటు బిడ్డకు పోషకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. అయినా ఇంట్లో తీసుకునే ఆహారం విషయంలో అవగాహన కొరవడుతోంది. ఇలాంటి పరిస్థితులకు స్వస్తి పలికేందుకు పోషణమా సం నిర్వహించి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.


అవగాహన కార్యక్రమాలు..

ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యరక్షణ, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. ఐసీడీఎస్‌, స్వచ్ఛంద సంస్థలు, విద్యాలయాలు, ఆరోగ్యశాఖ, వివిధ శాఖల భాగస్వా మ్యంతో ఈనెల 30 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి వారంలో ప్రజలు, మహిళలతో మమేకమై సమావే శాలు నిర్వహించి పిల్లలకు అందించే పౌష్టికాహారంపై వివరించి అవగాహన కల్పిస్తారు. రెండో వారంలో పిల్లలకు కథలను వినిపించి మాట్లాడించి చదివించ డం, ఆటపాటలతో విద్యనందించడం, రక్తహీనత గల పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణులు, బాలింతలను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. మూడోవారం లో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల బరువు, ఎత్తు కొలవడం, తక్కువ బరువు, పోషణలోపంతో బాధపడే చిన్నారులకు బాలామృతం, ప్లస్‌ అందజేస్తారు. పోషకా హారం, ఆరోగ్యంపై వైద్య విద్యాలయాల్లో సెమినార్లు నిర్వహిస్తారు. చివరి వారంలో తక్కువ బరువు ఉన్న పిల్లల వివరాలను పోషణ ట్రాకర్‌ అప్లికేషన్‌లో నమో దు చేసి ఎదుగుదలకు తీసుకోవాల్సిన, ఇంట్లో తయా రు చేసుకోవాల్సిన పోషకాహారంపై తల్లులు లేదా సంరక్షకులకు వివరిస్తూ అవగాహన కల్పిస్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం తల్లి పేరుతో పూలు, పండ్లు, ఔషధ మొక్కలు నాటించడం, తల్లిదండ్రులు, మహిళా సంఘాలచే సమావేశాలు నిర్వహించడంతో పాటు ఈ పోషణమాసంలో ఇంకా పారిశుధ్య కార్యక్రమాలు, కిచెన్‌ గార్డెన్స్‌, పిల్లలకు క్విజ్‌, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, వ్యాయామ, యోగా శిబిరాలు, ఆహార పంటలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


పోషకాహార లోపాలను అధిగమించేందుకు చర్యలు

- జెట్టి జయంతి, జిల్లా మహిళా శిశుసంక్షేమాధికారి, జనగామ

పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేం దుకు వివిధ దశల్లో చర్యలు తీసుకుంటున్నాం. పోషణ లోపాల పిల్లల వివరాలను ఎప్పటికపుడు నమోదు చేసుకుంటున్నాం. ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ నెల రోజుల పాటు కార్యక్రమాలు చేపడుతున్నాం. గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహార లోపం ప్రభావం పిల్లలపై పడుతోంది. వీరికి కావాల్సిన పౌష్టికా హారం ఎప్పుడు, ఏ మోతాదులో తీసుకోవాలో ప్రధానంగా తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు పోషకాహారం, ఆరోగ్య రక్షణ జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఇందుకోసం అంగన్‌వాడీల ఆధ్వర్యంలో మహిళలకు, గర్భిణులకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కిశోరబాలికలకు పోషకాహారం, ఆహారపదార్థాలు, ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశాలిచ్చాం.


ఇవి కూడా చదవండి:

Customers: జియో, ఎయిర్ టెల్, వీఐలకు షాకిచ్చిన కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్‌కు లాభం

iPhone 16: ఐఫోన్ 16కి విపరీతమైన క్రేజ్.. డే1 సేల్స్ ఎలా ఉన్నాయంటే..

Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే

Updated Date - Sep 21 , 2024 | 11:57 AM