ఎన్నాళ్లు నిరీక్షణ !
ABN , Publish Date - Jun 24 , 2024 | 12:18 AM
ఇళ్లులేని నిరుపేద లు తమ సొంతింటి కల సాకారం కోసం నిరీక్షిస్తున్నారు. ఎప్పుడు నెరవేరుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు అరచేతిలో స్వర్గం చూపుతూ.. గృహాలు మంజూరు చేస్తామని హామీలిస్తూ.. అధికారంలోకి వచ్చాక ముఖం చాటేస్తున్నారని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. తమకు అంతామేలు జరుగుతుం దని భావిస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలనవల్ల నష్టం జరిగిందని యావత్ ప్రజానీ కం కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే సొంత రాష్ట్రంలో కూడా అదేతంతు కొనసాగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదల సొంతింటి కల నెరవెరేదెన్నడో.?
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చారు, వసతులు మరిచారు
మానుకోటలో అంతర్గత రోడ్లు, తాగునీటి కోసం ఇక్కట్లు
జిల్లాలో పలుచోట్ల నిర్మాణాలు పూర్తయినా పేదలకు కేటాయించని ప్రభుత్వం
బేస్‌మెంట్, పిల్లర్లు, స్లాబ్ లెవల్‌లో మరికొన్ని..
గూడు కోసం కాంగ్రెస్ సర్కార్‌పై పేదల ఆశలు
మహబూబాబాద్ టౌన్, జూన్ 23 : ఇళ్లులేని నిరుపేద లు తమ సొంతింటి కల సాకారం కోసం నిరీక్షిస్తున్నారు. ఎప్పుడు నెరవేరుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు అరచేతిలో స్వర్గం చూపుతూ.. గృహాలు మంజూరు చేస్తామని హామీలిస్తూ.. అధికారంలోకి వచ్చాక ముఖం చాటేస్తున్నారని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. తమకు అంతామేలు జరుగుతుం దని భావిస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలనవల్ల నష్టం జరిగిందని యావత్ ప్రజానీ కం కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే సొంత రాష్ట్రంలో కూడా అదేతంతు కొనసాగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో బీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఇళ్లు లేని నిరుపే దలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వారి కలను సాకరం చే స్తామని పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ స్థలంలో ఒకే చోట డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి, ఏ ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 2016లో నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో పూర్తిస్థాయి డోర్నకల్, మా నుకోట, రెండేసి మండలాల ప్రాతినిధ్య పాలకుర్తి, ములు గు, ఇల్లందు నియోజకవర్గాల్లోని 18 మండలాల్లో 5,567 డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేశారు. అందులో 2,503 పూర్తి కాగా, అసలు ప్రారంభించనివి 1,101, పునా ది స్థాయిలో 379, స్లాబ్ పూర్తయినవి 414, వివిధ దశల్లో 1170 ఇళ్లు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చె ల్లించక పోవడం, కేటాయించిన నిధులు సరిపడక నిర్మా ణాలు చేయలేమని చేతులెత్తయడంతో అక్కడక్కడ పను లు నిలిచిపోయాయి. దీంతో కొన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో నిలిచిపోయాయి. 2503 ఇళ్లు పూర్తి కాగా 2155 మంది లబ్ధిదారులను ఎంపిక చే యగా అందులో 1403 మందికి ఇళ్లను కేటాయించారు. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినప్పటికి అరులైన నిరుపే దలకు కేటాయించకపోవడంతో అవి శిధిలావస్థకు చేరు కుంటున్నాయి. అంతే కాకుండా అ సాంఘీక కార్యకలపా లకు అడ్డాగా మారుతున్నాయి.
మానుకోట డబుల్ ఇళ్ల వద్ద వసతుల కరువు..
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన చోట లబ్ధిదారుల కిచ్చారు. కానీ అందులో వసతులు మరి చా రు. వసతుల లేమితో లబ్థిదారులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 360 ఇళ్లు మంజూరు కాగా, అందులో మొదటి దశలో ప్రారం భించిన 200 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిరుపేదలకు కేటాయించినప్పటికి అందులో వసతు లు లేకవారు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత రోడ్లు లేక వర్షం వస్తే బురదమయంగా మారడంతో అందులో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన ఽధైన్యస్థితి. మిషన్ భగీ రథ ద్వారా వచ్చేనీరు సరిపోక పోవడంతో వేసవి కాలం లో వారి కష్టాలు అంతా ఇంతా కాదు! మినరల్ వాటర్ కొనుగోలు చేసుకోవాల్సి వచ్చింది. ఇక వీధిదీపా లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి అయిం దంటే ఆ ప్రాంతం అంధకారంగా మారిపోతోం ది. వర్షాలు, గాలి దుమారం వచ్చిన సమ యంలో ఇళ్లలో సైతం కరెంటు పోతే భయంతో వణికిపోతున్నారు. వారికి సమీపంలోనే వైకుం ఠధామం ఉండడంతో భయ కంపితులవు తున్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల చుట్టూ కనీసం ప్రహారీగోడ కూడ లేకపోవడంతో పందులు, కుక్కలు లోనికి వస్తున్నాయి.
కాంగ్రెస్ సర్కార్‌పైనే పేదల కోటి ఆశలు...
ఇళ్లు లేని నిరుపేదలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. గత బీఆర్‌ఎస్ పదేళ్ల కాలం లో జిల్లా వ్యాప్తంగా 1,403 మంది ఇళ్లను మాత్రమే లబ్ధిదారులకు కేటాయించడంతో ఇళ్లు లేని నిరుపేదలు సొంతింటి కల నెరవేరలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేర్చింది. తాము అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షలు ఇస్తామని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నిరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంవత్సరానికి 3500 ఇళ్లు కేటాయించారు. వాటిపైనే ఇళ్లు లేని నిరుపేదలు ఆశలు పెట్టుకున్నారు.
నిర్మాణాలు పూర్తయిన కేటాయింపులేవి ?
జిల్లాలోని వివిధ మండలా ల్లో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణాలు పూర్తయినప్పటికి అవి పేదలకు కేటాయించకపో వడంతో అవి నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యకలపాల కు అడ్డాగా మారుతున్నాయి. ఏజెన్సీ మండలం కొత్తగూడలో పునాదులు, స్లాబ్, పిల్లర్ల దశ లో నిర్మాణాలు నిలిచిపోయా యి. చిన్న గూడూరు మండల కేంద్రంలో 100 ఇళ్లు నిర్మాణా లు పూర్తయినప్పటికి వాటిని కేటాయించకపోవడంతో అలం కార ప్రాయంగా మిగిలిపో యాయి. తొర్రూరు మునిసిపల్ కేంద్రంలో సైతం 290 ఇళ్లు నిర్మించినప్పటికి అవి కూడ ఎవరికి ఇవ్వలేదు. మరిపెడ మునిసిపల్ కేంద్రంలో నిర్మాణా లు అసంపూర్తిగా ఉన్నాయి. గంగారం మండలం ముల్క నూరు, గుంపెళ్లగూడెం, బుద్ధా రంతండాలో స్లాబ్‌లెవల్‌లో ఉన్నాయి. పెద్దవం గరలో ఇళ్లు పూర్తయిన కేటాయింపులు లేవు. ఇలా అక్కడక్కడ నిర్మా ణాలు పూర్తయినప్పటికి అవి పేదలకు కేటాయించపోవ డంతో నిరుపయోగంగా మారి పేదలకు సొంతింటి కల అందని ద్రాక్షలా మారింది.
మౌళిక వసతులు కల్పించాలి
పులి శ్రావణి, డబుల్‌బెడ్‌రూమ్ లబ్ధిదారుడు, మానుకోట
మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివార్లలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద మౌళిక వసతులు కల్పించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అంతర్గత రోడ్లు లేక వర్షం వస్తే వీధులన్ని బురదమయంగా మారుతున్నాయి. వీధి దీపాలు లేక అంఽధకారంలో మగ్గుతున్నాం. మిషన్ భగీరధ నీటీని సరఫరా చేస్తున్నప్పటికి అవి సరిపోక పోవడంతో నీటి కోసం తిప్పలు తప్పడం లేదు. అంతర్గత రోడ్లు నిర్మించి, వీధి దీపాలు ఏర్పాటు చేసి, తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలి..
బోయిని యాకన్న, చిన్నగూడూరు
చిన్నగూడూరు మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అర్హులైన నిరుపేదలకు కేటాయించాలి. ఇళ్ల నిర్మాణాలు పూర్తయి అనేక నెలలు గడుస్తున్నప్పటికి ఎన్నికల కోడ్ అడ్డురావడంతో వాటిని కేటాయించకుండా నిలిపివేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో అర్హులైన పేదలను గుర్తించి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించి వారి సొంతింటి కలను నెరవేర్చాలి.