జై శ్రీరామ్
ABN , Publish Date - Jan 22 , 2024 | 11:49 PM
జై శ్రీ రామ్.. అం టూ ఆలయాలు మార్మోగాయి. జిల్లా వ్యాప్తంగా రామ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామనామంతో మార్మోగిన ఆలయాలు
ఘనంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు
ఆలయాల్లో డిజిటల్ స్ర్కీన్‌ల ఏర్పాటు
ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించిన భక్తులు
ఇళ్లల్లో సైతం టీవీలకు అతుక్కుపోయిన జనం
ఊరూరా శోభాయాత్రలు, అన్నదానాలు
జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి
జనగామ కల్చరల్, జనవరి 22: జై శ్రీ రామ్.. అం టూ ఆలయాలు మార్మోగాయి. జిల్లా వ్యాప్తంగా రామ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి ప్రజలంతా అయోధ్యలోని రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యక్ష ప్రసారం చూసేలా ఏర్పాట్లు చేశారు.
అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్ర హ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం లోని శ్రీరాంనగర్ కాలనీ శ్రీ హనుమత్ రామ నాథ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం లో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎల్‌ఈడీ స్ర్కీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రధానార్చకులు మోహనకృష్ణ భార్గవ నేతృత్వంలో శ్రీరామ విజయ తారక మంత్ర సామూహిక ప్రార్థనలతో ప్రారంభమైన వేడుకలు జనగామ భక్త బృందం వారిచే వివిధ రామ స్తోత్ర పారాయణాలు, కీర్తనలు జరుపగా ఏకల్ అభి యాన్ వారిచే ప్రత్యేక భజనలు నిర్వహించారు. అనం తరం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయ ణం చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో రామనామ సంకీర్తనలతో అపూర్వ మైన అనుభూతికి లోనయ్యారు. దేవాలయ ప్రాంగణ మంతా రామ నామంతో మార్మోగగా భక్తులు తన్వయ త్వంతో బాల రాముడిని దర్శించుకున్నారు. అయోధ్య రాముడికి నీరాజనం అందిన వెంటనే అర్చకులు స్థానిక దేవాలయ మూలమూర్తులైన శ్రీ సీతారామచంద్ర స్వా మి వారలకు విశేష మహానీరాజనం అందించారు. మహా మంత్రపుష్పం అయోధ్య నుంచి అం దిన పరమ పవిత్ర పూజిత అక్షింతలతో భక్తు లకు మహదాశీర్వచనం అందించారు.
పోరాట ఫలితమే...
ఈ సందర్భంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జిల్లా ప్రముఖ్ దొంతుల శేఖర్ మాట్లాడుతూ దశాబ్ధాల పోరాటం, లక్షలాది మంది ప్రాణత్యాగాల ఫలితంగా నేడు నూట నలభై కోట్ల మంది హిందువుల కల సాకా రమైందన్నారు. మోహనకృష్ణ మాట్లాడుతూ అయోధ్య మోక్ష క్షేత్రాలలో ప్రధానమైందని, సాక్షాత్తూ శ్రీరామచ ద్ర ప్రభువు పుట్టిన జన్మభూమిలో ఇన్ని సంవత్సరాల తర్వాత బాలరాముడిని పునఃప్రతిష్ఠాపన జరుపుకోవ డం ఆనందంగా ఉందన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన భక్తుల జన్మ ధన్యమైందన్నారు. అనంతరం భక్తులు అన్న ప్రసాదం అందించారు. కార్యక్రమంలో గజ్జెల నర్సిరెడ్డి, పజ్జూరి లక్ష్మినర్సయ్య, జీవిలికపల్లి సత్య నారాయణ, వేముల సదానందం, యెలసాని కృష్ణమూ ర్తి, మల్లారెడ్డి, యాదగిరి, రాంబాబు, కుర్రెముల రాం ప్రసాద్, కళ్లెం నాగరాజు పాల్గొన్నారు.
బారో అసోసియేషన్ ఆధ్వర్యంలో...
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్లో బాలరాముడి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయవాదుల సహకారంతో అన్న ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరెళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజయ్య, ప్రసాదరావు, జాన్‌రెడ్డి, రాంగోపాల్, సుధీరంజన్ తదితరులు పాల్గొ న్నారు. అదే విధంగా స్థానిక పోచమ్మ గుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బండ పద్మ యాదగిరిరెడ్డి, కొల్లూరు లక్ష్మయ్య, ఆంజనేయులు, నిడిగొండ కృష్ణ పాల్గొన్నారు.
వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్...
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ ఉమామ హేశ్వర గుడిలో జరిగిన సీతారాముల ప్రత్యేక పూజా కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య పాల్గొ న్నారు. పురోహితులు కలెక్టర్‌కు పూర్ణకుంభంతో స్వాగ తం పలికి మహదాశీర్వచనం అందించారు. వినాయ కుడి పూజతో ప్రారంభించి హనుమాన్ చాలీసా, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు రాజేష్, చుంచు శ్రీకాంత్, ప్రభాకర్, రఘు, శ్రీనివాస్, నర్సింగరావు, ప్రకాష్, రామిని అనూరాధ, రేణుక తదితరులు పాల్గొన్నారు.