కష్టాల నౌకరీ
ABN , Publish Date - May 28 , 2024 | 11:50 PM
గ్రామ పంచా యతీల నిర్వహణ కష్టతరంగా మారింది. జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఫిబ్ర వరి 1 నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గెజిటెడ్ స్థాయి అధికారులను స్పెషలాఫీస్లుగా నియమించింది. ఒక్కొక్కరికి రెండ్రెం డు జీపీల బాధ్యతలు సైతం కట్టబెట్టింది. అయితే.. అన్నీ తమై పంచాయతీల నిర్వహణ చూసుకోవాల్సిన ప్రత్యేకాధికారులు పలువురు చుట్టపుచూపుగా వచ్చిపోతూ పరిపాలన వ్యవహారాలను పట్టించుకోవ డం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పంచాయతీ కార్యదర్శులపై అధిక పనిభారం
పరిపాలన బాధ్యతంతా వీరే పైనే..
పల్లె ఆలనాపాలన చూసుకోవాల్సిందే.. ..
చుట్టపు చూపులా వ్యవహరిస్తున్న స్పెషలాఫీసర్లు!
కృష్ణకాలనీ (భూపాలపల్లి), మే 28: గ్రామ పంచా యతీల నిర్వహణ కష్టతరంగా మారింది. జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఫిబ్ర వరి 1 నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గెజిటెడ్ స్థాయి అధికారులను స్పెషలాఫీస్లుగా నియమించింది. ఒక్కొక్కరికి రెండ్రెం డు జీపీల బాధ్యతలు సైతం కట్టబెట్టింది. అయితే.. అన్నీ తమై పంచాయతీల నిర్వహణ చూసుకోవాల్సిన ప్రత్యేకాధికారులు పలువురు చుట్టపుచూపుగా వచ్చిపోతూ పరిపాలన వ్యవహారాలను పట్టించుకోవ డం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో దాని ప్రభా వం గ్రామ కార్యదర్శులపై పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషలాఫీసర్లు కొందరు పట్టించు కోకపోవడంతో పంచాయతీ కార్యకలాపాల అత్యధిక భారం ఈ సెక్రటరీలపై పడుతోందని తెలుస్తోంది.
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అమలుల్లోకి వచ్చిన నాటి నుంచి పల్లెల్లో సమస్యలు దర్శనమిస్తున్నాయి. సర్పంచ్‌లకు ఉండే బాధ్యతలు ప్రత్యేకాధికారులకు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో పర్యవే క్షణ లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. పంచాయ తీ కార్యదర్శులు, ఎంపీవో, ఎంపీడీవో, మండల ప్రత్యేకాధికారులు కలిసి ప్రతి 15 రోజులకు లేదా నెలకోసారైనా గ్రామ సభలు నిర్వహిచాల్సి ఉంది. కానీ, అలాంటి పరిస్థితులేమీ గ్రామ పంచాయతీల్లో కానరావడం లేదు. అయితే.. ప్రత్యేకాధికారులుగా నియమితులైన వారికి కూడా కష్టాలు తప్పడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే తాము నిర్వహర్తిస్తున్న శాఖల బాధ్యతలతోపాటు పంచాయతీల్లో ప్రత్యేక అధికారి బాధ్యతలు సైతం చూసుకోవాల్సి వస్తుండటంతో రెండింటికీ న్యాయం చేయలేకపోతున్నారనే అభిప్రా యం కూడా ఉంది.
241 జీపీలు.. 131 మంది ప్రత్యేకాధికారులు
జయశంకర్ భూపా లపల్లి జిల్లా వ్యాప్తంగా 11 మండలాలు ఉన్నా యి. వీటిల్లో 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి రాగా జిల్లాకు 131 మంది ప్రత్యేకాధికారులను నియమిం చారు. కొందరికి ఒక్క జీపీ, మరికొందరికి రెండేసి జీపీల బాఽధ్యతలు అప్పగించారు. ఇలా 241 జీపీలకు 131 మంది అధికారులను నియమించారు. అయితే.. వీరిలో చాలా మంది పల్లె పాలనపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వారానికి ఒకసారైనా ఆయా జీపీని సందర్శించాల్సిన అధికారులు నెలలు గడిచినా కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది.
కార్యదర్శులకు తప్పని కష్టాలు
పల్లెల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులకు ఈ ప్రత్యేక పాలనతో ఇబ్బం దులు తప్పడం లేదు. ప్రత్యేకాధి కారులు అలా వచ్చి.. ఇలా వెళ్తారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జీపీల్లో ఆయా పనుల్లో కార్యదర్శులే తలమునకలవుతున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన ఆర్థిక సంఘం నిధులు నాలుగు నెలలుగా విడుదల కాకపో వడంతో పనులు చేపట్టలేక సతమతం కావాల్సి వస్తోం ది. అసలే వేసవికాలం కావడంతో ప్రజలకు తాగునీ టిని అందించేందుకు తంటాలు తప్పడం లేదు. పైపు లైన్ లీకేజీలు సరిచేయడం, కొత్త పైపులైన్లు వేయడం, బోర్ల రిపేరు చేయించడంతోపాటు ట్రాక్టర్ల డీజిల్ ఇతరత్రా ఖర్చులు, పారిశుధ్య నిర్వహణ ఇలా.. కార్య దర్శులకు తలకు మించిన భారమవుతోంది. కొన్ని జీపీల్లో తప్పని పరిస్థితుల్లో ఎంబీ రికార్డులు నమోదు చేస్తూ సొంతంగా ఖర్చు భరిస్తూ కాలం వెల్లదీస్తున్నామని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన పనిభారం
గ్రామాల్లో సర్పంచ్‌లను, వార్డు మెంబర్లను సమన్వ యం చేసుకుంటూ ఇన్నాళ్లు విధులు నిర్వర్తించిన పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం ప్రత్యేకాధికారి సూచన మేరకు పని చేయాల్సి వస్తోంది. ఆయా జీపీల్లో ప్రత్యేకాధికారులు నామ్‌కే వాస్తే అనట్టు వ్యవహరిస్తుండటంతో కార్యదర్శులకు పని భారం పెరుగుతోంది. ఉదయం 7 గంటలకే గ్రామ పంచాయ తీకి చేరుకొని ఆయా వార్డులను పరిశీలించాల్సి వస్తోంది. గ్రామంలో తాగునీరు వస్తుందా.. లేదా? అనే విషయాన్ని స్వయంగా పరిశీలించాలి. ఏదైనా జఠిల సమస్య అయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. పంచాయతీ ఆస్తులు, భూములు పరిరక్షించడంలో వీరిదే కీలక పాత్ర. పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేయడం, పంచాయతీ తీర్మానాలు ప్రవేశ పెట్టడం, జనన, మరణాల నమోదు, రికార్డుల నిర్వహణ, పంచాయతీలో పని చేసే ఉద్యోగులు, కార్మికుల పర్యవేక్షణ , మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) నుంచి పాలనకు సంబంధించిన సమాచారం పొందడం, సమావేశాలకు హాజరు కావడం ఇలా.. అనేక పనులు చూసుకోవాల్సి వస్తోందని కార్యదర్శులు అంటున్నారు.
ప్రత్యేకాధికారులు రాకుంటే నాకు చెప్పండి
- నారాయణరావు, భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)
గ్రామ పంచాయితీలకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన అధికారులు వారానికోసారైనా గ్రామాన్ని సందర్శించాలి. అలా ఎవరైనా సందర్శించడం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమాచారం ఇస్తే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం వాస్తవమే. అధికారులంతా సమన్వయంతో పల్లెల అభివృద్ధికి పాటుపడాలి.