చక్క‘బడి’ందా..?
ABN , Publish Date - Jun 11 , 2024 | 11:44 PM
బడి గంటలు మోగాయి. బుధవారం నుం చి ప్రభుత్వ పాఠశాలు పునఃప్రారం భమవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 420 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 20,710 మంది విద్యార్ధులు చవువుతున్నారు. మరో 30 పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ నమోదైంది. 20 నుంచి 30 పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులు ఆంగ్ల మాద్యమం ప్రారంభం కాకపోగా మిగతా అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్య మ తరగతులను నిర్వహిస్తున్నారు.
నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం
విద్యార్థులకు అందుబాటులోకి రాని సౌకర్యాలు
40 శాతం పాఠశాలల్లో ఆగిపోయిన అభివృద్ధి
420 అమ్మ ఆదర్శ స్కూళ్లలో పనులు షురూ
భూపాలపల్లిటౌన్, జూన్ 11: బడి గంటలు మోగాయి. బుధవారం నుం చి ప్రభుత్వ పాఠశాలు పునఃప్రారం భమవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 420 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 20,710 మంది విద్యార్ధులు చవువుతున్నారు. మరో 30 పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ నమోదైంది. 20 నుంచి 30 పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులు ఆంగ్ల మాద్యమం ప్రారంభం కాకపోగా మిగతా అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్య మ తరగతులను నిర్వహిస్తున్నారు. పలు పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కొనసాగనున్నాయి. ఇటీవల ప్రభు త్వం మారిన నేపథ్యంలో పాఠశాలల్లో పనిచేస్తున్న బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడనుంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా. ప్రభుత్వ పాఠశా లల పరిస్థితిలో మార్పులేదు. గత ప్రభుత్వం మన ఊరు- మన బడి పథకం ప్రవేశపెట్టి అభివృద్ధి పనులు చేపట్టింది. కానీ అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయలేదనే వాదనలున్నాయి. దీంతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణపనులు సైతం పూర్తికాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ పనుల్లో చాలా వరకు అంతంత మాత్రంగానే పూర్తయ్యాయి. దీంతో విద్యార్థులకు తిప్పలు తప్పేలా లేవు.
40 శాతం పాఠశాలల్లో ఆగిపోయిన పనులు
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్య అందిస్తామన్న పాలకుల హామీ నీటిమూటలే అయ్యిందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. మన ఊరు - మనబడి పథకం కింద జిల్లాలో మొదటి విడతగా 149 పాఠశాలలను అధికారు లు ఎంపిక చేశారు. 49 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. 90 పాఠశాలల్లో పనులు 50శాతం నుం చి 70శాతం వరకు పూర్తి కాగా మిగిలిన ఎనిమిది పాఠ శాలల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. టేకుమట్ల మండలకేంద్రంలోని ఎంపీపీఎస్‌లో పనులు ఏమాత్రం ప్రారంభం కాలేదు.
కేటాయించిన నిధులు రూ.32.15 కోట్లు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఎన్‌ఆర్‌ఈజీ ఎస్ పథకం కింద పనులు చేపట్టేందుకు రూ.18.96కో ట్లు కేటాయించారు. పాఠశాలల అభివృద్ధి కమిటీలకు రూ.13.19 కోట్లు కేటాయించారు. మొత్తం రూ.32.15 కోట్లలో మంజూరైంది మాత్రం తక్కువేనని అధికారు లు చెబుతున్నారు. పాఠశాలల అభివృద్ధి కమిటీలకు కేటాయించిన నిధులు రూ.13.19కోట్లలో ఇంకా 1.46కోట్లు పనులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికా రులు తెలిపారు.
రెండేళ్ల్లలో పూర్తయింది 49 పాఠశాలల్లోనే..
మన ఊరు.. మన బడి కార్యక్రమం 2021 డిసెంబ రులో ప్రారంభమైంది. నేటి వరకు పాఠశాలల అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని 420 పాఠశా లల్లో 149 పాఠశాలలను ఎంపిక చేసిన అధికారులు రెం డేళ్ల కాలంలో 49 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి చేయగలిగారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు సక్ర మంగా విడుదల చేయకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దీంతో పనులు నత్తనడకన సాగుతున్నా యని పలువురు కాంట్రాక్టర్లు అంటున్నారు. అప్పులు తీసుకొచ్చి పనులు చేసినప్పటికీ తమకు ఇంకా బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా జిల్లాలో 100 పాఠశాలల్లో పనులు పూర్తికావాల్సి ఉంది.
420 అమ్మ ఆదర్శ పాఠశాలలు.. రూ.14కోట్లు
జిల్లాలో మొత్తంగా 450 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 420 పాఠశాలల్లో తరగతులు జరుగుతున్నాయి. మరో 30 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడంతో అవి మూసివేత దశలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయు లు బడిబాట ద్వారా విద్యార్థులను బడికి తీసుకొచ్చే పరిస్థి తులు కనిపిస్తున్నాయి. 450 పాఠశాలల్లో 430 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా, మిగతా వాటిలో 6 ఆదర్శ పాఠశాలలు, 11 కస్తూర్బా గాంధీ పాఠశాలలు, డీఎన్‌టీ పాఠశాలలలు రెండు, అర్బ న్ రెసిడెన్సియల్ పాఠశాల ఒకటి ఉన్నాయి. వీటి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.14కోట్లు వెచ్ఛించగా అందులో మొదటి విడతగా 25శాతం అంటే.. 3.50కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 406 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల మరమ్మతులు, మరుగుదొడ్లలో మిగిలిపోయిన పనులు, తాగునీరు, విద్యుద్ధీకరణ, కొత్త టాయిలెట్స్ పనులు జరుగుతున్నాయి.