Share News

వడ్డీపై రాయితీ..

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:52 PM

మునిసిపాలిటీల్లో పేరుకుపో యిన పన్నుల వసూళ్లపై మునిసిపల్‌శాఖ దృష్టి సారించింది. పన్నులను వందశాతం వసూలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. గతంలో ముందస్తు చెల్లింపులపై 5 శాతం రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం ఆ ఆఫర్‌ అమలో ఉన్నప్పటికీ మరోవైపు బకాయిలను కూడా కట్టించేలా ప్రభుత్వం ఆలోచన చేసింది.

వడ్డీపై రాయితీ..
జనగామ మునిసిపల్‌ కార్యాలయం

మునిసిపల్‌ పరిధిలో బకాయిల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి

ఆస్తి పన్ను బకాయిలను పూర్తిగా చెల్లించిన వారికి 90 శాతం వర్తింపు

2022-23 బకాయిల్లో రూ.43.41 లక్షలే వసూలైన వైనం

ఆఫర్‌ ఇచ్చినా ఆసక్తి చూపని ప్రజలు

జనగామ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో పేరుకుపో యిన పన్నుల వసూళ్లపై మునిసిపల్‌శాఖ దృష్టి సారించింది. పన్నులను వందశాతం వసూలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. గతంలో ముందస్తు చెల్లింపులపై 5 శాతం రాయితీ ఇచ్చేది. ప్రస్తుతం ఆ ఆఫర్‌ అమలో ఉన్నప్పటికీ మరోవైపు బకాయిలను కూడా కట్టించేలా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా 2023 మార్చి లోగా బకాయిలు ఉన్న ఆస్తిపన్ను పన్ను విధించిన వడ్డీలో 90 శాతాన్ని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా సమయంలో ఆస్తిప న్నుపై ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి పన్ను చెల్లిం పుదారుల్లో కొంత నిరాసక్తత ఏర్పడింది. ప్రభుత్వం మళ్లీ పన్నుపై రాయితీ ఇస్తుందనే ఆశతో ఆస్తిపన్నును సకాలంలో చెల్లించడం లేదు. దీంతో మునిసిపల్‌ నిర్వహణపై కొంత భారం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. మార్చి 1 నుంచి ఈ రాయితీ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. జనగామ మునిసి పల్‌ పరిధిలో మార్చి 1 నుంచి ఆస్తిపన్ను వసూళ్లను సిబ్బంది వేగవంతంగా చేపడుతున్నారు. బకాయి ఉన్న ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీ ఇస్తుండడం తో కొంత మేర ప్రజల నుంచి స్పందన బాగానే కనిపిస్తున్నా అధికారులు ఆశించిన మేర ప్రజలు ముందుకు రావడం లేదు.

మొత్తంగా రూ. 5.23 కోట్ల బకాయిలు

జనగామ మునిసిపాలిటీ పరిధిలో ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు 14,700 ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తంగా రూ. 5.23 కోట్ల ఆస్తిపన్ను బకా యిలు పేరుకుపోయి ఉన్నాయి. ఇందులో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.14 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.3.07 కోట్లు బకాయి ఉంది. ప్రభు త్వం 2022-23 ఏడాదికి సంబంధించిన బకాయి ఉన్న ఆస్తిపన్ను వడ్డీలో 90 శాతం రాయితీని ప్రకటించింది. కాగా.. 2022-23 ఏడాదికి సంబంధించి రూ.1.14 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉండగా దీనిపై వడ్డీ రూ.84.82 లక్షలు ఉంది. పన్ను చెల్లింపుదారు లు తమ బకాయిలను పూర్తిగా చెల్లిస్తే రూ.84.82 లక్షల మేర లబ్ధి జరగనుంది.

బకాయి చెల్లింపుల్లో వెనుకడుగు

90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించినప్పటికీ అధికారులు ఆశించినంతగా ప్రజలు ముందుకు రావడం లేదు. 2022-23 ఏడాదికి సంబంధించి ఆస్తిపన్ను రూ.1.14 కోట్లు, దానిపై వడ్డీ రూ.84.82 లక్షలు మొత్తం గా రూ.1.98 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా.. రాయితీ ప్రకటించిన ఈ 10 రోజుల్లో కేవలం రూ.43.41 లక్షలు మాత్రమే 2022-23 ఏడాది బకాయిలు వసూలు అయ్యాయి. బకాయిలు చెల్లించేం దుకు మార్చి 31 వరకు గడువు ఉండగా ఆ లోగా వంద శాతం బకాయలు వసూలు అవుతాయనే ధీమాలో అధికారులు ఉన్నా రు. కాగా.. ప్రస్తుత ఏడాది(2023-24)కి సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపులు ఆశాజనకంగానే ఉన్నాయి. ఆస్తిపన్ను, వడ్డీ కలిపి రూ. 3.24 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ. 2.29 కోట్లు వసూలు అయ్యాయి. ఈ మార్చి 31 లోగా రూ. 95.02 లక్షలు వసూలు కావాల్సి ఉంది. ప్రభుత్వం వడ్డీపై రాయితీ ఇచ్చినా ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు.

ముందుగా చెల్లించిన వారికీ వర్తింపు

ప్రభుత్వం ప్రకటించిన వడ్డీపై రాయితీని మందస్తుగా చెల్లింపులు చేసిన వారికి కూడా వర్తింప చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వడ్డీపై 90 శాతం రాయితీకి సం బంధించి ఫిబ్రవరి 27న ప్రభుత్వం జీవో తీసుకురాగా మార్చి 2 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఈ నాలుగు రోజుల్లోనూ కొంత మంది చెల్లింపులు చేశారు. దీంతో తాము పూర్తిగా చెల్లించినా వడ్డీ రాయితీ రాదేమోనని ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు చెబు తున్నారు. జీవో వచ్చిన రోజు నుంచి చెల్లించిన ప్రతీ ఒక్కరికీ ఈ వడ్డీపై రాయితీ వర్తిస్తుందని భరోసా ఇస్తున్నారు. కాగా.. ముందస్తుగా చెల్లించిన వారికి వారికి రావాల్సిన వడ్డీపై 90 శాతం రాయితీని వచ్చే ఏడాది ఆస్తిపన్నులో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం జీవోలోనే పేర్కొంది.

అవగాహన కల్పిస్తున్నాం : పి. వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ కమిషనర్‌, జనగామ

2022-23 ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ రాయితీకి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మైకుల ద్వారా, పోస్టర్ల ద్వారా ప్రజలకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. మార్చి 31 వరకు గడువు ఉన్నందున ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి.

Updated Date - Mar 12 , 2024 | 11:52 PM