పాఠ్యాంశం సులభతరం
ABN , Publish Date - Jun 20 , 2024 | 11:43 PM
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెట్టి అమలు చేస్తోంది. మూడేళ్ల క్రితం ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది. ఇలా ఏటా ఒక్కో తరగతిని పెంచుతూ.. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్య మం బోధించనున్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా సర్కారు కృషి
ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల భాషల్లో పాఠాలు
ఈ ఏడాది ‘పది‘ విద్యార్థులకూ ద్విభాషా పుస్తకాలు
గ్రామీణ విద్యార్థులకు మరింత ప్రయోజనం
జిల్లాలో 508 బడుల్లో 65వేల మంది విద్యార్థులు
జఫర్‌గడ్, జూన్ 20: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెట్టి అమలు చేస్తోంది. మూడేళ్ల క్రితం ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది. ఇలా ఏటా ఒక్కో తరగతిని పెంచుతూ.. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్య మం బోధించనున్నారు. గతంలో సక్సెక్ పాఠశా లల పేరిట ప్రతి మండలంలో ఎంపిక చేయబ డిన కొన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియం బోధన ఉండేది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించా రు. అయితే పాఠ్యాంశాలను ఇంగ్లిష్‌లో ముద్రిం చడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోలేక పోతున్నారని భావించిన విద్యాశాఖ.. గత మూడేళ్లుగా తెలుగు, హిందీ మినహా భాషేతర పుస్తకాలైన గణితం, సామాన్యశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశా స్త్రం, సాంఘీక శాస్త్రం పుస్తకాల్లోన్ని అన్ని పాఠ్యాంశాలను ఆంగ్ల సమేతంగా తెలుగు భాష లో సైతం ముద్రిస్తోంది. గత ఏడాది వరకు ఒకటి నుంచి 9వ తరగతి వరకు ద్విభాషల్లో ముద్రించగా.. ఈ ఏడాది పదో తరగతి పుస్తకా ల్లో కూడా ప్రతి పాఠాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాష ల్లో ముద్రించారు. ఇలా ద్విభాషలో ముద్రించ డం వల్ల తెలుగు మీడియం, చదువులో వెనుక బడిన, గామీణ ప్రాంత విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకుం టారని, తద్వారా ఉత్తీర్ణత శాతం పెరుగుతుం దని భావిస్తున్నారు. జనగామ జిల్లాలో మొత్తం 508 పాఠశాలల్లో 65,128 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా..
ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బం దులు పడకుండా ఉండేందుకు విద్యాశాఖ పుస్తకాల్లో పాఠ్యాంశాలను ద్విభాషల్లో ముద్రణకు శ్రీకారం చుట్టింది. పిల్లలు ఆంగ్ల పాఠాలను చదవడంలో, పదాలను అర్థం చేసుకోవడంలో ఇక్కట్లను తొలగిం చేందుకు, ఆయా పాఠ్యాంశాలపై విషయ నైపుణ్యం పెంచుకునేందుకు పుస్తకాల ముద్రణలో మార్పులు చేపట్టారు. ద్విభాష ముద్రణ వల్ల ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాల్లో రెండు మాధ్యమాల్లో సులభంగా చదువుకునే అవకాశం ఉంది. పదానికి అర్థం తెలియకున్నా.. భాషాపరమైన సమస్యలు ఉన్నా.. పక్కనే ఉన్న పేజీలో తెలుగులో ఉండడంతో అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయుల కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
పుస్తకాలను రెండు విభాగాలుగా..
తెలుగు, హిందీ మినహా భాషేతర సబ్జెక్టుల్లోని ప్రతి పాఠ్యాంశంలో ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లిష్‌లో ముద్రించారు. ఈ ఏడాది పదో తరగతికి వర్తింపజేసి ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించారు. అలాగే విద్యార్థులపై పుస్తకాల భారం పడకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి పుస్తకాన్ని రెండు భాషల్లో ముద్రించడం వల్ల పేజీల సంఖ్య పెరిగి రెట్టింపు బరువు(భారం) అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పుస్తకాలను రెండు విభాగాలు చేశారు. సగం పాఠాలను భాగం-1, మిగతా సగాన్ని భాగం-2గా విభజించారు. వీటిని రెండు దఫాలుగా విద్యార్థులకు అందించనున్నారు.
కొత్త హంగులతో పుస్తకాలు
విద్యార్థులకు అందించే పుస్తకాలను కొత్త హంగుల తో రూపొందించారు. ఆకట్టుకునే చిత్రాలు, కవర్ పేజీ లతో ముద్రించారు. పేజీలోని పూర్తి పాఠం, సంబంధిత వీడియోల కోసం అక్కడ క్యూఆర్ కోడ్‌ను ముద్రించా రు. మొబైల్‌తో స్కాన్ చేయగానే అదనపు సమాచారం తో కూడిన వీడియో, ఫొటోలు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు సరికొత్త ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
సులభంగా ఉంది.. వేముల స్రవంతి,
10వ తరగతి, జడ్పీ హైస్కూల్, కూనూరు
పుస్తకాల్లో ఇంగ్లిష్, తెలు గు రెండు భాషల్లో ముద్రిం చడం వల్ల పాఠాలను అవగాహన చేసుకునేందుకు సులభంగా ఉంది. ఇంగ్లిష్‌లో అర్థం కాని విషయాలను, పదాలను తెలుగులో చదువుకుని అర్థం చేసుకునేందుకు ఎంతో ఉపకరిస్తుంది. కొన్ని క్లిష్టమై న అంశాలు, కొత్తగా పరిచయమైన పదాలను తెలు గులో ముద్రించడం వల్ల డిక్షనరీలతో అవసరం లేకుండా ఉంటోంది. ప్రస్తుతం పదవ తరగతికి కూడా ద్విభాషా పుస్తకాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకునే అవకాశం లభించింది.
కరదీపికలుగా నిలుస్తాయి..
- మంగు జయప్రకాశ్, గెజిటెడ్ హెచ్‌ఎం, జడ్పీ హైస్కూల్, హిమ్మత్‌నగర్
రెండు భాషల్లో పాఠ్యాంశా లను ముద్రించడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు ఎంతో ఉపయోగపడడమే కాకుండా వారికి కరదీపికలుగా నిలుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశా లల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించి తదను గుణంగా పాఠ్యపుస్తకాలను కూడా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఒకే పుస్తకంలో ముద్రించి విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు ఒక పాఠాన్ని, అందులోని కఠిన పదాలను తెలుగులో అర్థం చేసుకుని సులువుగా అధ్యయనం చేయగలరు.
మెరుగైన ఫలితాల సాధనకు దోహదం
- ఎండీ పర్వేజ్, మండల విద్యా నోడల్ అధికారి
ద్విభాషా పాఠ్యాంశాల ముద్రణ వల్ల మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుంది. విద్యాశాఖ తాజాగా రూపొందించిన పాఠ్యాంశాల ముద్రణతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు మీడియం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఈ విధానంతో ఎంతో ప్రయోజనం కలగనుంది. తెలుగు, ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలను ముద్రించడం కారణంగా ఇంగ్లిష్ భాష, ఆయా సబ్జెక్టుల్లో విషయ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు తోడ్పడుతుంది.