Share News

ఈ ఏడాదీ ఏం మారలే!

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:13 AM

ఈ ఏడాది జనగామ మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనుల్లో ఏ మార్పు లేదు. ఆగుతూ సాగుతూ జరుగుతుండ టంతో తాత్కాలిక షెడ్లలోనే తరగతులు నిర్వహించా ల్సిన దుస్థితి. పనులు వేగవంతం చేయడంలో అధికారులు అలసత్వం వీడడం లేదు. కాలేజీ నిర్మాణ పనులు మొదలుపెట్టి ఏడాది అవుతున్నా ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. జనగామ మెడికల్‌ కాలేజీని ఎన్‌ఎంసీ గత ఏడాది 100 సీట్లతో అనుమతిని ఇచ్చింది.

ఈ ఏడాదీ ఏం మారలే!
పిల్లర్ల దశలోనే ఉన్న జనగామ మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు

పూర్తి కాని జనగామ మెడికల్‌ కళాశాల నిర్మాణం

తాత్కాలిక షెడ్లలోనే వైద్య తరగతులు

ఇంకా పిల్లర్ల దశలోనే భవనం పనులు

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం

వసతుల కల్పనపై గతంలో ఎన్‌ఎంసీ జరిమానా

అయినప్పటికీ పనుల్లో కనిపించని వేగం

జనగామ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జనగామ మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనుల్లో ఏ మార్పు లేదు. ఆగుతూ సాగుతూ జరుగుతుండ టంతో తాత్కాలిక షెడ్లలోనే తరగతులు నిర్వహించా ల్సిన దుస్థితి. పనులు వేగవంతం చేయడంలో అధికారులు అలసత్వం వీడడం లేదు. కాలేజీ నిర్మాణ పనులు మొదలుపెట్టి ఏడాది అవుతున్నా ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. జనగామ మెడికల్‌ కాలేజీని ఎన్‌ఎంసీ గత ఏడాది 100 సీట్లతో అనుమతిని ఇచ్చింది. దీంతో గత సెప్టెంబరు 15న అప్పటి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మెడికల్‌ కాలేజీని వర్చువల్‌గా ప్రారంభించారు. ఎన్‌ఎంసీ అనుమతి ఇవ్వడంతో రూ. 20 కోట్లతో తాత్కాలికంగా షెడ్ల నిర్మా ణం చేపట్టి తరగతులను ప్రారంభించారు. అదే క్రమంలో శాశ్వత భవనాల నిర్మాణాలను ప్రారంభించారు. కాగా.. కాలేజీ ప్రారంభమై మొదటి సంవత్సరం ముగుస్తున్నా శాశ్వత భవనాల నిర్మాణం మా త్రం పూర్తి కాలేదు. దీంతో రెండో ఏడాది విద్యార్థులు, త్వరలో కౌన్సిలింగ్‌ ద్వారా రాబోయే మొదటి సంవత్సరం విద్యార్థులకు గతేడాది మాదిరిగానే తాత్కాలిక షెడ్లలోనే తరగతులు నిర్వహించనున్నారు.

పిల్లర్ల దశలోనే పనులు

జనగామ మెడికల్‌ కాలేజీ, విద్యార్థుల హాస్టళ్ల భవనాల నిర్మాణాలను రూ. 190 కోట్లతో చేపట్టారు. జిల్లాకేంద్రంలోని సిద్దిపేట రోడ్డులో ఉన్న 18.23 ఎకరాల హౌజింగ్‌ బోర్డు స్థలాన్ని మెడికల్‌ కాలేజీ కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించింది. పనులు ప్రారంభమై దాదాపు ఏడాది గడుస్తున్నా పనులు మాత్రం ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. జనగామ మెడికల్‌ కాలేజీలో సెకండియర్‌ నిర్వహణకు మరో 100 సీట్ల కు అనుమతినిస్తూ మే నెలలో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అక్టోబరు నెలలో ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియ పూర్తయి మొదటి సంవత్సరం విద్యార్థులు రానున్నారు. దీనికి మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ లోగా పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది శాశ్వత భవనాల్లో కాలేజీ నిర్వహణ అసాధ్యంగానే కనిపిస్తోంది.

వసతుల కల్పనపై ఎన్‌ఎంసీ సీరియస్‌

మెడికల్‌ కాలేజీలో వసతుల కల్పనపై నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) మే నెలలోనే సీరియస్‌ అయింది. శాశ్వత భవన నిర్మాణాలను పూర్తి చేయకపోవడంపై కాలేజీ అధికారులను ఎన్‌ఎంసీ వివరణ కోరింది. గతేడాది కాలేజీ ప్రారంభం సందర్భంగా వీలైనంత తొందరగా వసతులు కల్పించాలని చెప్పి నా పనులు పూర్తి చేయకపోవడంపై గుర్రు అయిం ది. రెండు నెలల్లోపు వసతులు కల్పించుకోవాలంటూ డెడ్‌లైన్‌ విధించింది. కౌన్సెలింగ్‌ పూర్తయితే అక్టోబరు నుంచి కొత్త విద్యార్థులు వస్తారు. దీంతో ఇదివరకే ఉన్న విద్యార్థులకు, కొత్త విద్యార్థులకు వస తి కల్పించడం తలకు మించిన భారం కానుంది. ఈ నేపథ్యంలో స్పందించి నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రెం డు నెలల్లోగా వసతులను కల్పించుకోవాలంటూ సమ యం ఇచ్చింది. దీంతో పాటు సకాలంలో వసతులు కల్పించనందుకు రూ.2లక్షల జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు నెలల తర్వాత రీఅసె్‌సమెంట్‌ నిర్వహిస్తామని, అప్పటికీ వసతులు సమకూర్చకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిం ది. కాగా.. ఎన్‌ఎంసీ ఇచ్చిన డెడ్‌లైన్‌ కూడా ముగిసింది. దీంతో ఎన్‌ఎంసీ అధికారులు మరోసారి రీఅసె్‌స మెంట్‌ చేసి కాలేజీ నిర్మాణ పనుల అలసత్వం పై సీరియస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ పనుల్లో మాత్రం వేగం కనిపించడం లేదు.

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం

మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం మూలంగా పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనులు నెమ్మదిగా జరగడంపై నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సీరియస్‌ అవుతున్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది ప్రారంభమైన పనులు ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం లోగా దాదాపుగా పూర్తి కావాల్సి ఉంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల అలసత్వం కూడా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. జనగామ మెడికల్‌ కాలేజీ శాశ్వత భవన నిర్మాణం విషయంలో ఇరిగేషన్‌ శాఖ మొదట్లో అభ్యంతరం తెలపడం వల్ల పనుల నిర్మాణంలో కొంత ఆలస్యం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మిస్తున్న స్థలం నుంచి ఇరిగేషన్‌ కెనాల్‌ ఉందంటూ నీటి పారుదల శాఖ అధికారులు నిర్మాణ పనులను మే నెలలో నిలిపివేశారని, దీంతో కొంత కాలం పనులు జరగలేదని అన్నారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల చొరవతో పనులు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు.

తరగతుల నిర్వహణ ఇబ్బంది లేదు

మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణం పూర్తి కానప్పటికీ ఈ ఏడాది విద్యార్థులకు తరగతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నాం. రెండో సంవత్సరంతో పాటు కౌన్సిలింగ్‌ తర్వాత రాబోయే మొదటి సంవత్సరం విద్యార్థులకు సరిపడా తరగతి గదులు ఉన్నాయి. ప్రస్తుతం బాలికలకు ధర్మకంచ బాలికల ఎస్సీ హాస్టల్‌లో, బాలురకు చంపక్‌హిల్స్‌లోని డీఆర్‌డీఏ భవనంలో హాస్టల్‌ వసతి కల్పించాం. కాగా.. విద్యార్థినులకు హాస్టల్‌ సౌకర్యం సరిపోకపోవడంతో శామీర్‌పేటలోని కోమటిరెడ్డి సుశీలమ్మ ఆశ్రమంలో హాస్టల్‌ వసతిని కల్పిస్తున్నాం.

-డాక్టర్‌ గోపాల్‌రావు, ప్రిన్సిపాల్‌, జనగామ మెడికల్‌ కాలేజీ

Updated Date - Sep 05 , 2024 | 12:13 AM