Share News

పాపన్నకోటపై పట్టింపేది?

ABN , Publish Date - May 28 , 2024 | 12:38 AM

బహుజనుల నాయకుడు పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన కోట రోజు రోజుకూ శిథిలమవుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండ గ్రామంలో గుట్టపైన, గుట్ట దిగువ భాగాన పాపన్న నిర్మించిన కోట గోడలు, గడీ కాలక్రమేణా శిథిలావస్థకు చేరుతున్నాయి. వాటిని పునరుద్ధరించినట్లైతే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుందని మండల ప్రజలు కోరుతున్నారు.

పాపన్నకోటపై  పట్టింపేది?
తాటికొండ ఖిలాగుట్ట

కలగా మిగిలిన ‘పర్యాటక క్షేత్రం’

అభివృద్ధికి ఆమడ దూరంలో కోట నిర్మాణం

కాలగర్భంలో కలుస్తున్న అద్భుత కట్టడాలు

కనుమరుగవుతున్న తాటికొండ ఖిలా చరిత్ర

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గ్రామస్థుల ఆశలు

స్టేషన్‌ఘన్‌పూర్‌, మే 27: బహుజనుల నాయకుడు పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన కోట రోజు రోజుకూ శిథిలమవుతోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండ గ్రామంలో గుట్టపైన, గుట్ట దిగువ భాగాన పాపన్న నిర్మించిన కోట గోడలు, గడీ కాలక్రమేణా శిథిలావస్థకు చేరుతున్నాయి. వాటిని పునరుద్ధరించినట్లైతే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుందని మండల ప్రజలు కోరుతున్నారు.

పర్యాటక కేంద్రంగా గుర్తించాలి..

పాపన్నకోటను పర్యాటక కేంద్రంగా మార్చే దిశగా 2019 అక్టోబర్‌ మాసంలో వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్‌, సివిల్‌ ఇంజనీర్‌ కామేశ్వర్‌రావు ఆఽఽఽఽధ్వర్యంలో ఇంజనీర్ల బృందం కోటలో పర్యటించి అభివృద్ధి చేయడానికి నివేదిక రూపొందించి అప్పటి ప్రభుత్వానికి నివేదించారు. 2019 నవంబరు మాసంలో తాటికొండ గ్రామానికి చెందిన వైస్‌ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి ఆఽఽధ్వర్యంలో నాయకులు అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ను కలిసి కోటను అభివృద్ధి చేయాలని వినతిపత్రం అందించారు. తదనంతరం 2021 జూలై 9న పురావస్తుశాఖ అధికారులు కోటను సందర్శించి కోట అభివృద్ధికి చేయాల్సిన పనులకు ఎస్టీమేషన్‌లు తయారు చేసుకొని వెళ్లారు. ఇప్పటికి మూడేళ్లు పూర్తి కావస్తున్నా పనులకు అతీగతి లేకుండా పోయింది.

పాపన్న చరిత్ర...

16వ శతాబ్ధంలో మోగలాయి చక్రవర్తులను గడగడలాడించిన స్వయంపాలన కోసం కుతుబ్‌షాహీలను ఎదిరించి ప్రత్యేక రాజ్యాన్ని స్థాపించి దేశ చరిత్రలోనే మొట్ట మొదటి బహుజనుల పాలకుడిగా సర్వాయి పాపన్న నిలిచాడు. ఆయన నిర్మించిన కట్టడాలను పర్యాటక కేంద్రంగా గుర్తిస్తామని చెప్పిన గత ప్రభు త్వం చివరకు మొండిచేయి చూపెట్టింది. ప్రస్తుత కాం గ్రెస్‌ ప్రభుత్వమైనా పాపన్న కోటను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్థులు కోరు తున్నారు. సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తున పాపన్న రాజ్యం నిర్మించడం విశేషం గా చెప్పుకోవచ్చు. గుట్టపైన అద్భుతమైన కట్టడాలను నిర్మించిన ఆయన శుత్రు రాజ్యాలపై సైనిక బలగాలను మోహరించేందుకు అనువైన ప్రాంతాన్ని ఎంచుకోవడంలో భాగంగానే తాటికొండ గ్రామాన్ని ఎంచుకున్నాడని చరిత్ర కారులు వివరిస్తున్నారు. గుట్టపైన నిర్మించిన కోట వద్దకు వెళ్లడానికి రాతి కట్టడాలతో ఏర్పాటు చేసిన ప్రవేశద్వారాలు దాటనిదే ముందుకు వెళ్లకుండా ఉన్నటువంటి నిర్మాణం తీరు చూడముచ్చటగా ఉంటుంది. గుట్టపైన విభిన్న రకాల ఏడు గుం డాలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.

తాటికొండను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలి..

- చల్లా సుదీర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ

చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తున్న తాటికొండ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలి. వీర యోధుడు పాపన్న కీర్తిని న లు దిశలా చాటేలా తగు చర్యలు తీసుకోవాలి. కోట దిగువన గల 5ఎకరాల స్థలంలో చిల్డ్రన్స్‌ పార్కు ఏర్పాటు చేసి సర్వాయి పాపన్న పార్కుగా నామకరణం చేశాం.

పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చాలి..

- బేతి రత్నాకర్‌ రెడ్డి, తాటికొండ

బహుజన యోధుడు సర్వాయి పాపన్న చరిత్రను నలు దిశలా చాటాలి. ప్రభుత్వం పాపన్న చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతాం.

Updated Date - May 28 , 2024 | 12:38 AM