Share News

గిరిజనుల గోడు వినేవారేరి?

ABN , Publish Date - Aug 25 , 2024 | 11:19 PM

జిల్లాలో సుమారు 60 వేలకు పైగా గిరిజనులు ఉన్నారు. కాని వారి బాధలు చెప్పుకోవడానికి జిల్లాలో ఒక్క కార్యాలయం కూడా లేదు. వారికి ఏదైనా సమస్య వస్తే హనుమకొండకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా ఏర్పడి 8 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి పలు గిరిజన, గిరిజన విద్యార్థి సంఘాలు ఎస్టీ కార్యాలయం కోసం డిమాండ్‌ చేస్తున్నా అధికారులు మాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఇప్పటికైనా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు స్పందించి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని గిరిపుత్రులు కోరుతున్నారు.

గిరిజనుల గోడు వినేవారేరి?

జిల్లాలో ఎస్టీ సంక్షేమ శాఖకు కార్యాలయం కరువు

జిల్లా ఏర్పడి 8 ఏళ్లయినా పట్టించుకోని పాలకులు

ఇన్‌చార్జులతోనే సరిపెడుతున్న సర్కారు

సమస్యలను విన్నవించుకునేందుకు గిరిజనుల తిప్పలు

జనగామ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గిరిజ నుల సంక్షేమాన్ని సంబంధిత అధికారులు పట్టించుకో వడంలేదు. వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారు. జనగామ జిల్లా ఏర్పడి 8 ఏళ్లవుతున్నా ఇంత వరకు జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ కార్యాల యాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీంతో జిల్లాలో గిరిజనుల గోడు వినేవారు కరువయ్యారు. తమ సమ స్యలు చెప్పుకుందామంటే కనీసం ఒక్క అధి కారి కూడా లేడు. 8 ఏళ్లుగా హనుమకొండ జిల్లా గిరి జన సంక్షేమ అధికారికే జనగామ జిల్లా బాధ్యతలను కూడా అప్పగి స్తూ వస్తున్నారు. దీంతో గిరిజనులు ఏవైనా సమస్యలు ఉంటే హనుమకొండ వరకు వెళ్లాల్సి వస్తోంది.

ఎనిమిదేళ్లుగా దిక్కులేదు..

జిల్లా ఏర్పడి 8 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు గిరిజ న సంక్షేమ శాఖ కార్యాలయాన్ని అధికారులు ఏర్పాటు చేయలేదు. జిల్లాలు ఏర్పడిన కొత్తలో తాత్కాలిక భవ నాల్లో జిల్లా కార్యాలయాలు కొనసాగాయి. ఆ తర్వాత 2022లో సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభం అయింది. ఈ క్రమంలో కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులోని ఎఫ్‌-25 బ్లాక్‌లో బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖకు కార్యాలయాలకు కేటాయించారు. మిగతా మూడు శాఖల కార్యాలయాలను అందులో ఏర్పాటు చేసుకోగా జిల్లా అధికారే లేకపోవడంతో ఎస్టీ సంక్షేమ శాఖ కా ర్యాలయం ఏర్పాటు కాలేదు. 8 ఏళ్లుగా పలు గిరిజ న, గిరిజన విద్యార్థి సంఘాలు ఎస్టీ కార్యాలయం ఏర్పాటు పై డిమాండ్లు చేస్తూ వస్తున్నా అధికారులు మాత్రం శ్రద్ధ వహించడం లేదు. జిల్లా వ్యాప్తంగా గిరిజనుల జ నాభా చాలా ఎక్కువగా ఉంటుంది. జిల్లాలోని 12 మం డలాల పరిధిలో 60 వేలకు పైగా గిరిజన జనాభా ఉం ది. కాని వారి సమస్య వినడానికి మాత్రం ఒక్క అధికా రి కూడా లేకపోవడం గిరిజనుల పట్ల అధికారులకు ఉన్న పట్టింపులేని తనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

సమస్యలుంటే హనుమకొండకు..

జిల్లాలో ఎస్టీ సంక్షేమ శాఖ కార్యాలయం గానీ, అధి కారి గానీ లేకపోవడంతో గిరిజనులు తమ సమస్యలు చెప్పుకునేందుకు హనుమకొండకు వెళ్లాల్సి వస్తోంది. జనగామ జిల్లాకు అధికారి లేకపోవడంతో హనుమకొండ జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారికే అదనపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం హనుమకొండకు వెళ్లక తప్పని పరస్థితి ఏర్పడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల సమస్యల విషయంలో విద్యార్థులు, గిరిజనులకు ప్రభుత్వం అందించే ట్రైకార్‌ రుణాలకు సంబంధించి దరఖాస్తులు, తదితర సమస్యల పరిష్కారం కోసం గిరిజనులకు నిత్యం ఎస్టీ సంక్షేమ శాఖ అధికారితో పని ఉంటుంది. అయితే హనుమకొండ వరకు వెళ్లలేని గిరిజనుల్లోని నిరక్షరాస్యులు, వృద్ధులు జనగామ కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణితో వినతులు ఇచ్చి వెళ్తున్నారు. ఈ వినతు లను హనుమకొండ జిల్లా అధికారికి పరిష్కారం కో సం కలెక్టర్‌ పంపిస్తున్నారు. వాటిలో చాలా వరకు పరి ష్కారానికి నోచుకోవడం లేదు. తాము ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తు స్థితి ఏంటో తెలుసుకుందామంటే మళ్లీ హనుమకొండ కార్యాలయానికే వెళ్లాల్సి వస్తోంద ని గిరిజనులు వాపోతున్నారు.

ప్రభుత్వ పరిధిలోని అంశం

- ప్రేమకళ, జిల్లా ఇన్‌చార్జి గిరిజన సంక్షేమ శాఖ అధికారి, జనగామ

జనగామతో పాటు గతంలో కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో ఎస్టీ కార్యాలయం ఏర్పాటు కోసం 2016లో గి రిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల నుంచి ప్రతి పా దనలు వెళ్లాయి. కార్యాలయం ఏర్పాటులో భాగంగా అవసరమయ్యే జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, సూప రింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్లు తదితర సిబ్బంది అవసరం ఉంటుంది. దీనికి సం బంధించి పంపించిన ప్రతిపాదనలకు ఫైనాన్స్‌ క్లియ రెన్స్‌ రావా ల్సి ఉంది. ఆ అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది.

ఏళ్ల తరబడి అడుగుతున్నాం..

- బానోత్‌ ధర్మభిక్షం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటూ 8 ఏళ్లుగా అడుగుతూనే ఉన్నాం. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సుమారు 60 వేలకు పైగా గిరిజన జనాభా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో జనాభా ఉన్న సామాజిక వర్గానికి కార్యాలయం లేకపోవడం శోచనీయం. జిల్లాలో కార్యాలయం గానీ, కనీసం ఒక్క అధికారి గానీ లేకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం హనుమకొండకు వెళ్లాల్సి వస్తోంది. ఎస్టీ సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటుపై అధికారులు ఇప్పటికైనా స్పందించాలి.

Updated Date - Aug 25 , 2024 | 11:19 PM