కంట్రోల్ అయ్యేనా..?!
ABN , Publish Date - Jun 18 , 2024 | 11:45 PM
వర్షాకాలం వచ్చేసింది. అంటువ్యాఽధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వైద్యా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో వ్యాఽధులు విజృంభించకుండా చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణకు సిద్ధమైంది. అయితే.. ప్రతి ఏటా అప్రమత్తంగానే ఉన్నామని అధికారులు చెబుతున్నా వ్యాధుల నిర్మూలన సాధ్యం కావడం లేదు.
పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు
అప్రమత్తంగానే ఉన్నామంటున్న అధికారులు
వరదలతో నీరు కలుషితం కావడంతో వ్యాపిస్తున్న రోగాలు
ప్రతి ఏటా నమోదవుతున్న మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా కేసులు
భూపాలపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం వచ్చేసింది. అంటువ్యాఽధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వైద్యా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో వ్యాఽధులు విజృంభించకుండా చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణకు సిద్ధమైంది. అయితే.. ప్రతి ఏటా అప్రమత్తంగానే ఉన్నామని అధికారులు చెబుతున్నా వ్యాధుల నిర్మూలన సాధ్యం కావడం లేదు. దోమలు, నీటి సంబంధిత కారణాలతో వ్యాపించే వ్యాఽధులు ప్రతి సీజన్‌లోనూ వ్యాపిస్తూనే ఉన్నాయి. మలేరియా, డయేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర రుగ్మతలకు ప్రజలు గురవుతూనే ఉన్నారు. వర్షాల కారణంగా జిల్లాలోని తాగునీటి వనరులన్నీ వరదనీటితో కలుషితమయ్యే అవకాశాలున్న దృష్ట్యా ప్రజానీకం అంటువ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి.
అంటువ్యాఽధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా మారుమూల అటవీ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పక్షం రోజుల క్రితం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరిగిం ది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి, అంట వ్యాధుల ప్రబల కుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అదేశించారు. అలాగే ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా జిల్లా అధికారులకు సూచిం చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ధి చెందే అవకాశమున్న పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖాధికారులను కలెక్టర్ అదేశించారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని నిర్ణయించారు.
అధికారుల ముందస్తు చర్యలు
జిల్లాలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు పొంచి ఉన్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ కారణంగా వ్యాఽధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉండగా పారిశుధ్య నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం అప్రమత్తం చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు కార్యాచరణపై దృష్టి పెట్టారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా భూపాలపల్లి జిల్లాలోని 98 ఆరోగ్య ఉప కేంద్రాలు, 13 పాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వేలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది జాల్లాలో 80కి పైగా డెంగీ, 14 మలేరియా కేసులు వెలుగుచూడ్డంతో ఈసారి అలాంటి పరిస్థితులు పునారావృతం కాకుండా చర్యలు ప్రారంభించారు.
నియంత్రణ సాధ్యమేనా?
జిల్లాలో అంటువ్యాఽధులు ప్రబలకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా ప్రతి ఏటా అవి ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ప్రతి వర్షాకాలంలో మలేరియా, డెంగీ, డయేరియా, వైరల్ ఫీవర్, టైఫాయిడ్ వంటి వ్యాఽధులు ప్రబలడం సర్వసాధారణమైంది. ముఖ్యంగా కనుమరుగైపోయిందని భావించిన మలేరియా భూపాలపల్లి జిల్లాలో తిరిగి విజృంభిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి జిల్లాను మలేరియా సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో చేర్చి నియంత్రణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అప్రమత్తంగానే ఉన్నామని జిల్లా అధికారులు చెబుతున్నా ఈఏడాది సీజనల్ వ్యాధుల నియంత్రణ సాధ్యమేనా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో వైద్య సిబ్బంది కొరత ఉంది. నలుగురు మెడికల్ ఆఫీసర్లు, 12 పల్లె దవాఖానాల డాక్టర్ల పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసి, మందుల కొరత లేకుండా చూడ్డం, వైద్య సిబ్బందిని మారుమూల ప్రాంతాలకు పంపి ప్రజలకు కావాల్సిన చికిత్సను సకాలంలో అందిస్తేనే సీజనల్ వ్యాఽధులను అరికొట్టొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా ఉండటం, వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా మారుతుండటంతో ఆరోగ్య కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలకు చేరి సకాలంలో వైద్య సేవలు అందించగలుగుతారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అప్రమత్తంగానే ఉన్నాం..
- డాక్టర్ మధుసూదన్, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి
వర్షాలు, వరదల కారణంగా సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో మా శాఖ అప్రమత్తంగానే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ఇప్పటికే సిబ్బంది ద్వారా సమస్యాత్మక గ్రామాల్లో ప్రజల కు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అలాగే అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉంచుతున్నాం. దీంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాం తాల్లో పారిశుధ్య కార్యక్రమాలను వేగంగా చేపట్టేందుకు సంబంధిత శాఖతో కలిసి పనిచేస్తున్నాం.