Share News

Ponguleti Srinivasa Reddy: రూ.7లక్షల కోట్ల అప్పుతో అధికారంలోకి వచ్చాం..

ABN , Publish Date - Jul 15 , 2024 | 01:37 PM

గత పది సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వం గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేడు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో ఆయన మాట్లాడుతూ..

Ponguleti Srinivasa Reddy: రూ.7లక్షల కోట్ల అప్పుతో అధికారంలోకి వచ్చాం..

ఖమ్మం: గత పది సంవత్సరాలుగా పాలించిన ప్రభుత్వం గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. నేడు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఏ గ్రామానికి వెళ్లిన మౌళిక వసతులపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేద వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న గత ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైందన్నారు. గ్రామాలను తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం కచ్చితంగా చేస్తుందన్నారు.


వర్షా కాలం కావడంతో సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయని పొంగులేటి అన్నారు. గ్రామాల్లో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వరాల విషయమై అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారన్నారు. రూ.7లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే అప్పుల సాకు చూపి వెనకడుగు వేసే ఉద్దేశ్యం మాకు లేదని పొంగులేటి అన్నారు. క్యాబినెట్ స్థాయిలో నిర్ణయాలు తీసుకోకుండా రైతుల వద్దకు వచ్చామన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టే కుట్రలు బీఆర్ఎస్ చేస్తోందన్నారు. వ్యవసాయం ఆదాయంపై ఇన్ కామ్ టాక్స్ కట్టే పరిస్థితిలో రైతు లేడని పొంగులేటి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Vijayasai Reddy: అప్పుడు జగన్ వద్దన్నారని ఆగా.. ఇప్పుడు ఎవ్వరి మాటా వినను..

SBI Interest Rates: ఎస్‌బీఐ అనూహ్య నిర్ణయం.. పెరగనున్న ఈఎంఐలు!

Updated Date - Jul 15 , 2024 | 01:37 PM