Share News

Harish Rao: మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా?.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు పంచ్‌లు

ABN , Publish Date - Sep 15 , 2024 | 08:10 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘దూలం లెక్క పెరిగిన ఓ సన్నాసి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని నాకు సవాల్ విసిరాడు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నా ఎత్తు మీద ఎందుకు అసూయా?. నువ్వు లిల్లి పుట్ అంత ఉన్నవ్ అనలేనా?’’ అంటూ హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

Harish Rao: మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా?.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు పంచ్‌లు
Harish Rao

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘దూలం లెక్క పెరిగిన ఓ సన్నాసి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని నాకు సవాల్ విసిరాడు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నా ఎత్తు మీద ఎందుకు అసూయా?. నువ్వు లిల్లి పుట్ అంత ఉన్నవ్ అనలేనా?’’ అంటూ హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

‘‘రేవంత్ రెడ్డి మాటలు మోరీల కంపును మించాయి. బూతులు మాట్లాడి గౌరవం ఇవ్వాలంటే ఎలా ఇస్తారు. ఈ రోజు నా మీద ఇష్టానుసారం మాట్లాడారు. నాకు మాట్లాడం రాదా? కానీ సంస్కారం అడ్డు వస్తోంది. నీ బుద్ధి, చరిత్ర, ఆలోచన అంతా కురచ. నువు వెంపలి చెట్టు అంత పెరిగావ్? నా అంత ఎత్తుకు నువ్వు పెరగలేవు. నా ఎత్తు గురించి ఆలోచన ఆపి రైతుల గురించి ఆలోచించు. రుణమాఫీ ఎక్కడ అయింది. చిల్లర మాటలు ఎందుకు. నీ కొండారెడ్డి పల్లి వెళ్లి ఆడుగుదాం పా? రుణమాఫీ అయిందో?. మాట తప్పిన సన్నాసివి నువ్వు కాదా?’’ అంటూ హరీశ్ రావు ఫైర్ అయ్యారు.


రుణమాఫీ కానీ రైతుల వివరాలు తానే పంపిస్తానని, మాఫీ చేయాలని హరీశ్ రావు అన్నారు. ‘‘అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తా అన్నారు. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటున్నారు. రెండు లక్షల పైగా రుణం ఉన్న రైతులు మేము చెప్పినప్పుడు కట్టాలని వ్యవసాయ మంత్రి చెబుతున్నారు. వ్యవసాయ మంత్రిది ఒక మాట సీఎం రేవంత్ ఒక మాట. నీ గుండెల్లో నిద్రపోతున్న మిగతా రుణమాఫీ చేసే వరకు నీ గుండెల్లో నిద్ర పోతా. ఫోర్త్ సిటీ డ్రామాలు ఆపండి. కేసీఆర్ ఫార్మాసిటీ కోసం 12 వేల కోట్ల ఎకరాలు సేకరించి పెట్టారు. దాన్ని ఫార్మా సిటీ చేయకుండా ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నారు. అధికారంలోకి వస్తే రైతులు భూములు రైతులకు ఇస్తాం అన్నారు. ఇవ్వండి. కాంగ్రెస్‌కు రెండోసారి గెలిచే సీన్ లేదు. వైఎస్ హయాంలో ఉచిత కరెంట్ ఏపాటి వచ్చిందో ప్రజలకు తెలుసు. కౌశిక్ రెడ్డిపై నేనే దాడి చేపించానని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. మనోళ్లే వాళ్ల ఇంటికి వెళ్లారు అన్నారు. ఇప్పుడు గాంధీ ఎవరి వాడు చెప్పండి’’ అని హరీశ్ రావు అన్నారు.


రింగ్ రోడ్డు 2022లో మంజూరైంది..

రీజనల్ రింగ్ రోడ్డు 2022లోనే మంజూరు అయ్యిందని హరీశ్ రావు అన్నారు. ‘‘ మేము మంజూరు చేపించిన దాన్ని కూడా తానే చేపించినట్టు అబద్దం చెప్పారు. ఈ ఒక్కరోజే రేవంత్ రెడ్డి పది అబద్దాల మాట్లాడారు. టీచర్ ట్రాన్స్‌ఫర్స్ 18 ఏళ్ల క్రితం జరిగాయని అబద్దం చెప్పారు. రేవంత్ ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి. సభ్యతతో ఉండాలి’’ అని మాజీ మంత్రి అన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 08:17 PM