Share News

TG News: మైలార్‌దేవ్ పల్లిలో రెచ్చిపోయిన రౌడీ షీటర్, అతని అనుచరులు

ABN , Publish Date - Aug 07 , 2024 | 02:04 PM

మైలార్‌దేవ్ పల్లిలో రౌడీ షీటర్ సోహెల్ అతని అనుచరులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి యూటూబ్ ఛానెల్ రిపోర్టర్ మూబీన్‌పై కత్తితో దాడి చేశారు. మూబీన్ శరీరంఅంతా కత్తి పోట్లకు గురైంది. అడ్డుకోబోయిన వారి పై కూడా దాడి చేసి సోహెల్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది.

TG News: మైలార్‌దేవ్ పల్లిలో రెచ్చిపోయిన రౌడీ షీటర్, అతని అనుచరులు

హైదరాబాద్: మైలార్‌దేవ్ పల్లిలో రౌడీ షీటర్ సోహెల్ అతని అనుచరులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి యూటూబ్ ఛానెల్ రిపోర్టర్ మూబీన్‌పై కత్తితో దాడి చేశారు. మూబీన్ శరీరంఅంతా కత్తి పోట్లకు గురైంది. అడ్డుకోబోయిన వారి పై కూడా దాడి చేసి సోహెల్ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది. హుటాహుటిన ముబీన్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మూబీన్ ఉస్మానియా ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్నాడు. కత్తితో దాడి చేయడమే కాకుండా.. ‘ఇప్పుడు నా చేతి నుండి తప్పించుకున్నావు. ఎప్పటికైనా నిన్ను హత్య చేస్తా’ అంటూ సొహెల్ వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. రౌడీ షీటర్ అరాచకాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి.


సోహెల్ గ్యాంగ్ అరాచకాలను మూబీన్ తన‌ యూట్యాబ్ ఛానల్‌లో టెలిక్యాస్ట్ చేశాడు. దీంతో సోహెల్ పగ బట్టినట్టుగా తెలుస్తోంది. యూట్యూబ్ నుంచి ఆ లింక్ తీసేస్తే సరి.. లేకపోతే చస్తావంటూ సొహెల్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. వార్తకు సంబంధించిన లింక్‌ను మూబీన్ తొలగించడం లేదు. దీంతో మూబీన్ పై కత్తులతో దాడి చేశారు. రౌడీ షీటర్ పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు మూబీన్ డిమాండ్ చేస్తున్నాడు. అతనికి జర్నలిస్టు సంఘాలు మద్దతు పలికాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం సొహెల్, అతని అనుచరులు పరారీలో ఉన్నారు. పరారిలో ఉన్న నిందితుడి కోసం మైలార్ దేవ్‌పల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


అబిడ్స్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ..

మరోవైపు అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు కమ్యూనిటీల మధ్య జరిగిన ఘటనల వల్ల వివాదం తలెత్తింది. వాల్మీకి సమాజ్‌పై ఓ వ్యక్తి కించపరిచే వాక్యాలు చేశాడని అంటున్నారు. ఘన్‌ఫౌండ్రిలో ఉండే ఒక వ్యక్తికి మల్కాజిగిరికి చెందిన మరో వ్యక్తికి మధ్య వివాదం జరిగింది. గన్‌ఫౌండ్రిలో ఉండే వాల్మీకి సమాజ్ కి చెందిన గౌరవ్ రాజ్.. తన స్నేహితుడు బబ్లుతో కలిసి మద్యం సేవించాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే వాల్మీకి సమాజ్‌పై బబ్లు దుర్భాషలాడాడు. గౌరవరాజ్ దానినంతా వీడియో తీసి ఇన్‌స్టా గ్రాంలో షేర్ చేశాడు. విషయం తెలుసుకున్న వాల్మీకి సమాజ్ ప్రతినిధులు దాదాపు100 మందితో అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితునిపై ఫిర్యాదు చేశారు. తమ సమాజ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బబ్లూపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Aug 07 , 2024 | 02:04 PM