ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డికి బెయిల్

ABN, Publish Date - Nov 17 , 2024 | 09:40 PM

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డికు విజయవాడలోని ఏసీబీ కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం రాత్రి జైలు నుంచి వెంకట రెడ్డి విడుదలయ్యారు. అయితే ప్రతి శనివారం ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాలని ఏసీబీ కోర్టు వెంకట్ రెడ్డికి సూచించింది.

అమరావతి, నవంబర్ 17: ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డికు విజయవాడలోని ఏసీబీ కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం రాత్రి జైలు నుంచి వెంకట రెడ్డి విడుదలయ్యారు. అయితే ప్రతి శనివారం ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాలని ఏసీబీ కోర్టు వెంకట్ రెడ్డికి సూచించింది.

అలాగే దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ఇక ప్రస్తుతం ఉంటున్న నివాస చిరునామాతోపాటు.. ఇతర చిరునామాలను కోర్టుకు అందజేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే వెంకటరెడ్డి బెయిల్ అంశాన్ని ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 17 , 2024 | 09:43 PM